శ్రీలంకతో నిన్న జరిగిన టీ20లో భారత యువ జట్టు ఈజీగా గెలిచేసింది. బ్యాటింగ్ లో శిఖర్ ధావన్, సూర్యకుమార్, బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ రాణించడంతో శ్రీలంకను చిత్తు చేసింది. అయితే మ్యాచ్ కు ముందు జరిగిన ఘటన మాత్రం తెగ వైరల్ అయ్యింది.
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు సంప్రదాయం ప్రకారం ఇరు జట్ల ఆటగాళ్లు తమ జాతీయ గీతాలను ఆలపించారు. ముందుగా భారత జాతీయగీతం రాగా.. మన జట్ల ఆటగాళ్లు, కోచ్ లు అందరూ లేచి నిల్చుండి పాడారు. ఆ తర్వాత శ్రీలంక జాతీయ గీతం మొదలైంది. ఇక్కడే షాకిచ్చే పరిణామం చోటుచేసుకుంది.
‘నమో నమో మాతా’ అంటూ శ్రీలంక జాతీయ గీతం మొదలవగానే శ్రీలంక ఆటగాళ్లతోపాటు మన భారత క్రికెటర్ హార్ధిక్ పాండ్యా కూడా వారితోపాటు ఆలపించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే యథాలాపంగా పాడాడా? పక్కదేశం గీతం బాగుందని హమ్ చేశాడో తెలియదు కానీ ఇప్పుడు ట్రోలింగ్ కు గురవుతున్నాడు.
ప్రస్తుతం హార్ధిక్ పాండ్యా వీడియో సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతోంది. శ్రీలంక జాతీయ గీతం ఆలపించిన హార్ధిక్ పాండ్యాపై సెటైర్లు వేస్తున్నారు. కొందరు పాండ్యా జాతీయ భావానికి పొగుడుతుంటే ఇంకొందరేమో శ్రీలంక పట్ల అంత ప్రేమ ఉంది కాబట్టి తొలి టీ20లో హార్ధిక్ పాండ్యా ఘోరంగా ఫెయిల్ అయ్యాడని విమర్శిస్తున్నారు. మొత్తానికి పాండ్యా పాడిన ఈ గీతం ప్రస్తుతం నెటింట్లో తెగ వైరల్ అవుతోంది.
Is it just me that saw @hardikpandya7 singing the SL national anthem, then? #SLvInd pic.twitter.com/TuALbiRFu4
— Pranith (@Pranith16) July 25, 2021