ఇండియన్ నేవీలో ఉద్యోగ ఖాళీలు.. రాతపరీక్ష లేకుండా..?

షార్ట్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 40 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. అయితే ఈ ఏడాది భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో పరీక్ష నిర్వహించకుండానే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం. సర్వీస్ సెలక్షన్ బోర్డ్ మార్కులను బట్టి ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే […]

Written By: Navya, Updated On : July 26, 2021 9:06 am
Follow us on

షార్ట్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 40 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. అయితే ఈ ఏడాది భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో పరీక్ష నిర్వహించకుండానే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం. సర్వీస్ సెలక్షన్ బోర్డ్ మార్కులను బట్టి ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జులై నెల 30వ తేదీలోపు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.joinindiannavy.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

ఎలక్ట్రికల్ బ్రాంచ్ లో మొత్తం 40 ఉద్యోగ ఖాళీలు ఉండగా వీటి కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. పెళ్లి కాని పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2022 సంవత్సరం జనవరి నెలలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎలక్ట్రానిక్ బ్రాంచ్‌లో కోర్సు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉంటాయి. కేరళ రాష్ట్రంలోని ఎజిమల ప్రాంతంలో ఉన్న ఇండియన్ నేవల్ అకాడమీలో కోర్సు నిర్వహణ ఉంటుందని సమాచారం.

1997 జనవరి 2 నుంచి 2002 జూలై 1 మధ్య జన్మించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మెడికల్ టెస్ట్, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెరిట్ లిస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. బెంగళూరు, కోల్‌కతా, భోపాల్, విశాఖపట్నంలలో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెల 21వ తేదీ నుంచి ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూలు జరుగుతాయి.