పాన్ ఇండియా పఠాన్.. సాహో.. హ్యాపీ బర్త్ డే ప్రభాస్

పాన్ ఇండియా పఠాన్… బాలీవుడ్, టాలీవుడ్ సాహో.. ఫిల్మ్ ఇండస్ట్రీ డార్లింగ్.. ప్రభాస్. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ కు ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. బహుబలి సినిమాతో బాక్సాఫీస్ బాదుషాగా మారిన ప్రభాస్ నేడు 41వ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. కొట్లాది మంది ఫ్యాన్స్ , సినిమా ఫ్రెండ్స్, సెలిబ్రిటీలు అంతా డార్లింగ్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. Also […]

Written By: NARESH, Updated On : October 23, 2020 3:48 pm
Follow us on

పాన్ ఇండియా పఠాన్… బాలీవుడ్, టాలీవుడ్ సాహో.. ఫిల్మ్ ఇండస్ట్రీ డార్లింగ్.. ప్రభాస్. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ కు ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. బహుబలి సినిమాతో బాక్సాఫీస్ బాదుషాగా మారిన ప్రభాస్ నేడు 41వ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. కొట్లాది మంది ఫ్యాన్స్ , సినిమా ఫ్రెండ్స్, సెలిబ్రిటీలు అంతా డార్లింగ్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

Also Read: మోనాల్ ను కాపాడుతున్న ‘బిగ్ బాస్’.. ఈవారం ఎలిమినేషన్ ఉండదా?

*సినిమా సినిమాకు పరిణితి..
2002లో ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్.. మొదటి సిన్మాతోనే పర్లేదు అనిపించుకున్నారు. ఫిట్ నెస్ తోనే కాకుండా మంచితనంతో అందరితో డార్లింగ్ అనిపించుకున్నాడు. కెరీర్ మొదట్లో సరైన హిట్లు లేక సతమతమయ్యాడు. తర్వాత 2004లో వచ్చిన వర్షం సినిమా పెద్ద హిట్ కావడంతో తన క్రేజ్ ను కొంచెం కొంచెంగా పెంచుకుంటూ వచ్చాడు.. అయితే తర్వాత మళ్లీ ఫెయిల్యూర్స్ ప్రభాస్ ను పలకరించాయి. మళ్లీ కొంచెం ఇబ్బంది పడిన తరుణంలో రాజమౌళి చేతిలో పడ్డాడు. మంచి టైంలో ఛత్రపతి వచ్చింది. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ప్రభాస్ ను మాస్ హీరోగా నిలబడడానికి దోహదం చేసింది. తర్వాత మళ్లీ కొన్ని ప్లాప్ లు వచ్చాయి. ఈక్రమంలోనే డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్ లాంటి ఫ్యామిలీ, లవ్ ఎంటర్ టైనర్ లు వచ్చి ప్రభాస్ మళ్లీ గాడిలో పడ్డాడు. అన్ని రకాల ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. మాస్ మసాలా మూవీ మిర్చీ తో బాక్సాఫీస్ డోస్ పెంచుకున్నాడు.

*బహుబలితో ఎవరెస్ట్..
మళ్లీ రాజమౌళితో సినిమా.. భారీ బడ్జెట్ తో మొదలైన బహుబలి.. భారత సినిమాకు చుక్కానిలా నిలిచింది. ఇండియా సినిమాలు హలీవుడ్ కు తీసిపోవు అని నిరూపించింది. ప్రపంచ ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ 5ఏండ్లు కేటాయించాడు. ఈ కష్టం ఊరకనే పోలేదు. దానికి తగ్గట్టు బహుబలి 1,2 లలో పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ అవతరించాడు. వంద సిన్మాల క్రేజ్ ఒక్క సినిమాతో సంపాదించాడు డార్లింగ్.. ఈ క్రేజ్ తోనే వచ్చిన సాహో.. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. అయితే బాలీవుడ్ లో ఆకట్టుకున్నా ఈ చిత్రం.. టాలీవుడ్ జనాలకు మాత్రం ఎక్కలేదు. ఓపెనింగ్స్ బాగానే వచ్చి ప్రొడ్యూసర్ కు లాస్ అయితే రాలేదు. అయినా కూడా ప్రభాస్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు..

Also Read: ‘రాధేశ్యామ్’ నుంచి ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ ఇదే

*వరుసగా బిగ్ బడ్జెట్ మూవీలు..
ఇక డార్లింగ్ .. నెక్ట్స్ సినిమాలన్నీ భారీ బడ్జెట్ లే.. అన్నీ పాన్ ఇండియా మూవీలు.. వీటితో ప్రభాస్ మరిన్ని రికార్డులు తిరుగ రాస్తడనడంలో ఎలాంటి డౌట్ లేదు. మొదటగా రాధేశ్యాంతో ప్రభాస్ అలరించబోతున్నాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్.. ఈ సినిమాపై ఇప్పుడే భారీ అంచనాలు ఉన్నాయి. తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో సైన్స్ ఫిక్షన్ మూవీ రాబోతోంది.. భారీ చిత్రాల వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక రామాయణం స్టోరీ ఆధారంగా ఆదిపురుష్ .. బహుబలి రేంజ్ లో తెరకెక్కనుంది. ఇందులో రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ ఆలీఖాన్ నటించబోతున్నారు. దీనికి ఓం రావత్ దర్శకత్వం వహిస్తున్నాడు. అజయ్ దేవ్గన్ కూడా స్పెషల్ రోల్ పోషించనున్నట్లు సమాచారం.