సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలో రేపు జరిగే ఉప ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఉప ఎన్నిక ఏర్పడడంతో ఇక్కడ మొదట ఏకగ్రీవంగానే ఉంటుందని టీఆర్ఎస్ భావించింది. అయితే రానురాను పోటీ తీవ్రత ఎక్కువవడంతో ఎవరు గెలుస్తారోనన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. టీఆరఎస్ నుంచి సోలిపేట సుజాతరెడ్డి పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి బరిలో ఉన్నారు. అయితే దుబ్బాక నియోజకవర్గం విశేషాలేంటో ఇప్పడు చూద్దాం..
Also Read: బీజేపీకి గట్టి దెబ్బ.. రూ.కోటి తరలిస్తుండగా రఘునందన్ బావమరిది అరెస్ట్
దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం ఏడు మండలాలు ఉన్నాయి. వీటిలో సిద్దిపేట జిల్లాలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయిపోల్ ఉండగా.. మెదక్ జిల్లా పరిధిలోని నార్సింగ్, చేగుంట మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. నియోజకవర్గంలో మొత్తం 1,98, 807 ఓట్లు ఉన్నాయి. వీరిలో లక్షా 779 మంది మహిళలు కాగా.. 98 వేల 28 మంది పురుషుల ఓట్లు ఉన్నాయి. 2018 ఎన్నికలతో పోల్చుకుంటే ప్రస్తుతం 8 వేల ఓట్లు పెరిగాయి. ఈ నియోజకవర్గంలో ముదిరాజ్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.
2009 లో ఏర్పడ్డ దుబ్బాక నియోజకవర్గంలో మూడు సార్లు ఎన్నికలు జరిగాయి.ఆ సంవత్సరంలో మహాకూటమి పొత్తులో భాగంగా టీఆర్ఎస్ సీటు దక్కించుకుంది. అయితే అప్పటి వరకు టీడీపీలో ఉన్న చెరుకు ముత్యంరెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లడంతో ఆయన గెలుపొందారు. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు. 2018లో టీఆర్ఎస్ కు 89వేల 299, కాంగ్రెస్ కు 26 వేల 799, బీజేపీకి 22 వేల 595 ఓట్లు వచ్చాయి.
Also Read: టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ: రాష్ట్రంలో భీకర వాతావరణం
దుబ్బాక నియోజకవర్గంలో రేపు 315 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. కరోనా కారణంగా పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. కరోనా కారణంగా సాయంత్రం సమయాన్ని పెంచారు. ఈనెల 10 ఫలితం వెలువడనుంది.
ఇక బలాబలాలను చూస్తే టీఆర్ఎస్ తరుఫున హరీష్ బలంగా కొట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత గెలుపుకోసం శాయశక్తులు ఒడ్డుతున్నాడు. ఇక కేంద్రంలోని అండతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, బీజేపీ చీఫ్ బండి సంజయ్ కొట్లాడుతున్నారు. కానీ అధికార బలంతో టీఆర్ఎస్ ఇక్కడ బీజేపీని ముప్పుతిప్పలు పెడుతోంది. ఇక మధ్యలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దిగ్గజ నేతలను మోహరించి వారి ప్రచారం వారు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రజలు ఎవరికి ఓటు వేస్తారన్నది ఉత్కంఠగా మారింది. రేపు పోలింగ్ తర్వాత వేవ్ తెలియనుంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్