https://oktelugu.com/

చంద్రబాబు ఈసారి కొత్తప్లాన్ వేస్తున్నాడట..

టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మధ్య రాజకీయాల్లో యాక్టివ్ గా మారుతున్నారు. కరోనా ప్రారంభం నుంచి మీడియాకు కూడా కనిపించని బాబు ఇప్పడిప్పుడే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడున్న ప్రభత్వంపై వ్యతిరేకత రావడం, కోర్టు తీర్పులు వగైరా వంటి విషయాల్లో ముఖ్యమంత్రి జగన్ ను ఇరుకున పడుతుండడంతో ఇదే అదను చూసిన మాజీ సీఎం ఇప్పుడు తాజాగా కొత్త అంశాన్ని లేవనెత్తతున్నట్లు తెలుస్తోంది. కరోనా విషయంలో గట్టిగా నిర్ణయం తీసుకుంటే త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 2, 2020 11:04 am
    Follow us on

    CBN Politics

    టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మధ్య రాజకీయాల్లో యాక్టివ్ గా మారుతున్నారు. కరోనా ప్రారంభం నుంచి మీడియాకు కూడా కనిపించని బాబు ఇప్పడిప్పుడే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడున్న ప్రభత్వంపై వ్యతిరేకత రావడం, కోర్టు తీర్పులు వగైరా వంటి విషయాల్లో ముఖ్యమంత్రి జగన్ ను ఇరుకున పడుతుండడంతో ఇదే అదను చూసిన మాజీ సీఎం ఇప్పుడు తాజాగా కొత్త అంశాన్ని లేవనెత్తతున్నట్లు తెలుస్తోంది. కరోనా విషయంలో గట్టిగా నిర్ణయం తీసుకుంటే త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

    Also Read: ‘ఏం భాష స్వామి అది’.. సీఎం జగన్‌ భాషపై టీడీపీ ట్రోల్‌

    టీడీపీలోని మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆదివారం రహస్యంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వర్ల రామయ్య, జవహర్,ఎంఎస్ రాజు సహా ఇతర కీలక నేతలు హాజరై ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వర్గీకరణ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, అవరమైతే ప్రధాని నరేంద్ర మోదీ, కేంధ్ర మంత్రలును కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తరువాత 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత బాబు ఎన్నికల హామీలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించాడు. ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీ వర్గీకరణకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన బాబు ఆ విషయాలను పట్టించుకోలేదు. ఎన్నికల ముందు టీడీపీకి అనుకూలంగా ఉన్న మందక్రిష్ణ మాదిగ ఎస్సీవర్గీకరణపై పోరాటం చేయడంతో ఆయనను రాష్ట్రంలోకి రావద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.

    Also Read: జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వాళ్లకు రూ. 10 వేలు జమ..!

    ఆంధ్రప్రదేశ్ లో మాలల సంఖ్య ఎక్కువగా ఉన్నందున వారికి ప్రాధాన్యం ఇస్తూ ఎస్సీ వర్గీకరణ అంశంపై చిన్న చూపు చూశాడు. దీంతో మాదిగ సామాజిక వర్గం టీడీపీకి దూరమవడంతో 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమిని చవిచూసింది. తాజాగా చంద్రబాబు అన్ని సామాజిక వర్గాలతో సమావేశం నిర్వహించి వారి మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం టీడీపీలోని మాదిగ సామాజిక వర్గం నాయకులు సమావేశమైనట్లు సమాచారం. దీంతో ఎస్సీ వర్గీకరణపై బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని అందరిలో ఆసక్తి నెలకొంది.
    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్