గ్రేటర్ ‘ఫజిల్’.. మేయర్ కోసం అసెంబ్లీ సీట్లను త్యాగం చేస్తారా..!

గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. అయితే ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో గ్రేటర్లో హంగ్ ఏర్పడింది. టీఆర్ఎస్ కు 55.. బీజేపీకి 48.. ఎంఐఎంకు 44.. కాంగ్రెస్ కు రెండుసీట్లను నగర ఓటర్లు కట్టబెట్టారు. ఒక్క నెరేడ్ మెట్ ఫలితం మాత్రం తేలాల్సి ఉంది. ఈ స్థానంలో బీజేపీ.. టీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొంది. Also Read: బండి సంజయ్ ‘టైగర్’.. పవన్ హాట్ కామెంట్స్ టీఆర్ఎస్ 55 సీట్లకుతోడు ఎక్స్ ఆఫీషియో […]

Written By: Neelambaram, Updated On : December 5, 2020 3:58 pm
Follow us on


గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. అయితే ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో గ్రేటర్లో హంగ్ ఏర్పడింది. టీఆర్ఎస్ కు 55.. బీజేపీకి 48.. ఎంఐఎంకు 44.. కాంగ్రెస్ కు రెండుసీట్లను నగర ఓటర్లు కట్టబెట్టారు. ఒక్క నెరేడ్ మెట్ ఫలితం మాత్రం తేలాల్సి ఉంది. ఈ స్థానంలో బీజేపీ.. టీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొంది.

Also Read: బండి సంజయ్ ‘టైగర్’.. పవన్ హాట్ కామెంట్స్

టీఆర్ఎస్ 55 సీట్లకుతోడు ఎక్స్ ఆఫీషియో ఓట్లను కలుపుకున్నప్పటికీ మేయర్ పీఠం అందనుంత దూరంలోనే ఉంది. దీంతో తప్పనిసరిగా పరిస్థితిలో టీఆర్ఎస్ ఒకరి సాయం అర్థించాల్సి వస్తోంది. టీఆర్ఎస్-బీజేపీ.. బీజేపీ-ఎంఐఎం పొత్తు కుదిరే అవకాశం లేదు. దీంతో టీఆర్ఎస్-ఎంఐఎం మధ్యే డీల్ కుదిరే అవకాశం ఉంది.

టీఆర్ఎస్ సొంతంగా మేయర్ పీఠం దక్కించుకోవాలంటే మాత్రం ఎంఐఎంతో పొత్తు.. లేదా బయటి నుంచి ఆపార్టీ మద్దతు కోరడమే చేయాల్సి ఉంది. టీఆర్ఎస్ ఒకవేళ ఎంఐతో పొత్తు పెట్టుకుంటే ముందుగా సంబరపడిది బీజేపీనే. తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో టీఆర్ఎస్ ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటే తన గొయ్యి తాను తవ్వుకున్నట్టే అవుతుంది.

ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఎంఐఎంతో టీఆర్ఎస్ అంటకాగుతుందని.. తెర వెనుక డ్రామాలు ఎందుకు.. నేరుగా పొత్తు పెట్టుకోండి.. అంటూ కేంద్ర మంత్రి అమిత్ షా సవాల్ విసిరారు. దీంతో సీఎం కేసీఆర్ ఎంఐఎంతో నేరుగా పొత్తుపెట్టుకుంటే ఏం జరుగుతుందో ఆయన తెలుసు. దీంతో కేసీఆర్ అలాంటి ఛాన్స్ తీసుకోకపోవచ్చని తెలుస్తోంది. కేవలం బయటి నుంచి మద్దతు కోరే అవకాశమే ఉందని తెలుస్తోంది.

Also Read: జీహెచ్ఎంసీ కౌంటింగ్: జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు

మేయర్ ఎన్నిక సమయంలో ఎంఐఎం గైర్హజర్ అయి టీఆర్ఎస్ కు పరోక్షంగా మద్దతు తెలుపొచ్చు. అయితే ఎంఐఎం ఎలాంటి ప్రతిఫలం లేకుండా మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ కు వదిలేస్తుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. టీఆర్ఎస్ తో ఎంఐఎం నేరుగా పొత్తుపెట్టుకోకున్నా పరోక్షంగా రెండేళ్ల తర్వాత మేయర్ పదవీ అడిగే అవకాశం ఉంది.

ఒకవేళ టీఆర్ఎస్-ఎంఐఎంలు తమను మోసం చేస్తున్నట్లు ప్రజలు భావిస్తే మాత్రం టీఆర్ఎస్ కు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిదెబ్బ పడే అవకాశం ఉంది. దీంతో గ్రేటర్ ఫజిల్ ను సీఎం కేసీఆర్ ఎలా పరిష్కరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్