శత్రువుకు శత్రువు మిత్రుడన్న చందంగా కాంగ్రెస్.. టీఆర్ఎస్ లు ఏకమవుతున్నాయి. నిన్నటి జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు ఒకరిపై ఒకరు ఆరోపణలు.. ప్రత్యారోపణలు చేసుకున్న నేతలంతా బీజేపీపై ఉమ్మడి పోరుకు సిద్ధమవుతున్నారు. ఈ రెండు పార్టీలు కూడా కేంద్రానికి వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి.
Also Read: కాంగ్రెస్ లో చిచ్చుపెడుతున్న టీపీసీసీ.. తీరుమార్చుకోని నేతలు..!
రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగింది. దుబ్బాక.. గ్రేటర్ ఎన్నికల్లో కమలదళం టీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ టీఆర్ఎస్ కు కొరకరాని కొయ్యగా మారనుండటంతో గులాబీ బాస్ కన్నెర్రజేస్తున్నారు. నిన్నటి వరకు కేంద్రంతో సఖ్యతగా మెలిగిన టీఆర్ఎస్ మోదీ సర్కారుపై ప్రత్యక్ష పోరుకు సిద్ధమవుతోంది.
ఇక బీజేపీ అన్ని రాష్ట్రాల్లోనూ బలపడుతుండటం కాంగ్రెస్ కు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తాచాటడంతో కాంగ్రెస్ అధిష్టానం అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల రైతులంతా కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన చేపడుతుండటంతో కాంగ్రెస్ వారికి మద్దతు ప్రకటించింది.
Also Read: వైసీపీలో వర్గ విభేదాలు.. కొట్టుకుంటున్న నేతలు
ఈక్రమంలోనే రైతులు డిసెంబర్ 8న భారత్ బంద్ కు పిలుపునివ్వడంతో కాంగ్రెస్.. టీఆర్ఎస్ లు వేర్వురుగా సంపూర్ణంగా మద్దతు ప్రకటించాయి. రైతులకు అనుకూలంగా.. కేంద్రానికి వ్యతిరేకంగా ఈ రెండు పార్టీలు మద్దతు ప్రకటించడం వెనుక బీజేపీ రాష్ట్రంలో బలపడటమే కారణమని తెలుస్తోంది. అయితే రానున్న రోజుల్లోనూ కేంద్రంపై ఈ రెండు పార్టీలు ఇలానే కలిసి పోరాటం చేస్తాయా? లేదా అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్