హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన బాధితులను టీడీపీ నేత లోకేశ్ ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారి బాగోగులను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ మంత్రి ఆళ్లనాని సొంత నియోజకవర్గంలోనే నీరు కలుషితం కావడం దారుణమన్నారు. దానికి కారణాలు కనుక్కోకుండా నీరు కలుషితం కాలేదని చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. పారిశుధ్యంపై ప్రభుత్వం ద్రుష్టి పెట్టకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ఏలూరులో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాలని డిమాండ్ చేశారు. కాగా ఇప్పటి వరకు 267 మంది బాధితులు […]

Written By: Suresh, Updated On : December 6, 2020 4:25 pm
Follow us on

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన బాధితులను టీడీపీ నేత లోకేశ్ ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారి బాగోగులను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ మంత్రి ఆళ్లనాని సొంత నియోజకవర్గంలోనే నీరు కలుషితం కావడం దారుణమన్నారు. దానికి కారణాలు కనుక్కోకుండా నీరు కలుషితం కాలేదని చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. పారిశుధ్యంపై ప్రభుత్వం ద్రుష్టి పెట్టకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ఏలూరులో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాలని డిమాండ్ చేశారు. కాగా ఇప్పటి వరకు 267 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వారిలో 80 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మిగతావారు చికిత్స పొందుతున్నారు. ఒకరి పరిస్థితి ఆందోళనగా ఉండడంతో ఆయనను విజయవాడకు తరలించారు.