https://oktelugu.com/

‘గోరటి’ కలం నుంచి ఇకపై వచ్చేది కేసీఆర్ నామస్మరణేనా?

గోరటి వెంకన్నకు వాగ్గేయ, జానపద కళకారుడిగా తెలంగాణ సమాజంలో మంచి గుర్తింపు ఉంది. తెలంగాణ ప్రత్యేక పోరాట సమయంలో గోరటి వెంకన్న రాసినా, పాడిన పాటలు ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి దోహదపడ్డాయి. తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న అనేక కష్టాలను.. కన్నీళ్లను గోరటి వెంకన్న పాటల రూపంలో ఆవిష్కరించారు. Also Read: వాహ్‌.. కేసీఆర్‌‌ మార్క్‌ షెడ్యూల్.‌! కుబుసం మూవీలో ‘పల్లె కన్నీరు పెడుతున్నది’ అని గోరటి రాసిన పాట కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి బ్రతుకు పోరాటానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 17, 2020 7:53 pm
    Follow us on

    KCR Goreti

    గోరటి వెంకన్నకు వాగ్గేయ, జానపద కళకారుడిగా తెలంగాణ సమాజంలో మంచి గుర్తింపు ఉంది. తెలంగాణ ప్రత్యేక పోరాట సమయంలో గోరటి వెంకన్న రాసినా, పాడిన పాటలు ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి దోహదపడ్డాయి. తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న అనేక కష్టాలను.. కన్నీళ్లను గోరటి వెంకన్న పాటల రూపంలో ఆవిష్కరించారు.

    Also Read: వాహ్‌.. కేసీఆర్‌‌ మార్క్‌ షెడ్యూల్.‌!

    కుబుసం మూవీలో ‘పల్లె కన్నీరు పెడుతున్నది’ అని గోరటి రాసిన పాట కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి బ్రతుకు పోరాటానికి నిలువుటద్దంగా నిలిచింది. దీంతోపాటు ‘జై బోలో.. జైబోలో అమరవీరులకు జైబోలో’ అంటూ పాడిన పాడిన ఆయన మంచిపేరును తీసుకొచ్చింది. అదేవిధంగా ‘గల్లీ చిన్నది గరీబోళ్ల కథ చెబుతది’ సామాన్యుల కష్టాలను పాటరూపంలోఅద్భుతంగా కళ్లకు కట్టినట్లు చూపించారు.

    ఇదిలా ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం గోరటి వెంకన్నకు ఇటీవల ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. ఎమ్మెల్సీ ఆయన తర్వాత గొరటి వెంకన్న ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే ఇకపై ఆయన నుంచి కేసీఆర్ నామజపం తప్ప తెలంగాణ కన్నీటి పాటల రావని అర్థమవుతోంది. గత ఆరేళ్లలో కేసీఆర్ సర్కార్ తెలంగాణను పూర్తి స్థాయిలో అభిృవృద్ధి చేసిందంటూ ప్రకటించేశారు.

    Also Read: జీహెచ్ఎంసీ ఎన్నికలపై రగడ..ఈసీకి బీజేపీ ఫిర్యాదు

    తెలంగాణలోని ప్రాజెక్టులతో పంటపొలాల్లోకి నీరొస్తుందని.. అలాంటప్పుడు ఇంకా కన్నీటి పాటలు రాయలేనని ఆయన స్పష్టం చేశారు. కవి కలం సమస్యలు ఒకరకంగా.. అభివృద్ధి ఉంటే ఒకరకంగా స్పందిస్తుందని తేల్చేశారు. తెలంగాణ ప్రజలకు కష్టాలు లేవా? అంటే మాత్రం ప్రజల కష్టాలన్నీ ఒకేసారి తొలగిపోవని సూత్రీకరించారు. అభివృద్ధి అనే చూసేవారి దృష్టికోణాన్ని బట్టి ఉంటుందంటూ ప్రభుత్వానికి బాసటగా నిలిచారు.

    గోరటి వెంకన్న ఎమ్మెల్సీగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే ఆయన కంటికి తెలంగాణ యావత్ అభివృద్ధి చెందినట్లు కన్పిస్తుంది. గతంలో తెలంగాణ సమాజంలోని కన్నీటి బాధలను పాటరూపంలో తీసుకొచ్చిన వెంకన్న మాటతీరులో మార్పు కన్పిస్తోంది. తెలంగాణలో ఎలాంటి ఆకలిబాధలు లేవన్నట్లు మాట్లాడుతున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    దీంతో ఇకపై ఆయన కలం నుంచి కేసీఆర్ అనుకూల పాటలు మినహా.. మరే పాటలు రావనే అభిప్రాయం కలుగుతోంది. ప్రజా సమస్యలపై కాకపోయిన కనీసం తోటి కళాకారుల సమస్యలపై అయినా గోరటి వెంకన్న గొంతు స్పందిస్తుందో లేక మూగబోతుందా? అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!