Homeఎంటర్టైన్మెంట్మెగా హీరో సినిమా పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

మెగా హీరో సినిమా పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

Sai Dharam Tej
మెగా హీరో సాయి తేజ్ మొత్తానికి ప్లాప్ ల ప్రళయంలో నుండి బయట పడి ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ‘చిత్రలహరి, ప్రతిరోజూ పండగే’ సినిమాలతో హిట్ ట్రాక్లో ఉన్న సాయి తేజ్ ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటరు’ విడుదల కోసం ఎదురుచూస్తూనే.. మరో సినిమా షూట్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని దేవ కట్ట డైరెక్ట్ చేస్తున్నారు. దేవా కట్ట సినిమాలు సహజంగానే కాస్త వైవిధ్యంగా ఉంటాయి. పెద్దగా కమర్షియల్ అంశాలు ఏమి ఉండవు. అయినా కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటుంది.. అందుకే హీరోలు కూడా దేవా కట్టాతో వర్క్ చేయడానికి బాగా ఇంట్రస్ట్ చూపిస్తారు.

Also Read: పవన్ మూవీకి త్రివిక్రమ్ సహకారం.. పారితోషికం ఎంతంటే?

ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైందన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో సాయి తేజ్ క్యారెక్టర్ పై ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ డ్యుయేల్ రోల్ చేస్తున్నారట. ట్విన్స్ గా చేస్తున్నాడని.. ఒకరి ప్లేస్ లోకి మరొకరు వెళ్లాల్సి వస్తోందని.. ఈ క్రమంలో జరిగే కొన్ని నాటకీయ పరిణామాలు చాలా ఇంట్రస్టింగ్ ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో తేజ్ సరసన నివేత పేతురాజ్ ను కథానాయకిగా తీసుకున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి ‘చిత్రలహరి’లో నటించారు.

Also Read: బిగ్ బాస్-4.. అఖిల్ కరివేపాకు.. అభిజిత్ ఊర మాస్.. నెట్టింట్లో గోలగోల..!

అలాగే మరో హీరోయిన్ పాత్రలో ఐశ్వర్య రాజేష్ ను తీసుకున్నారు. ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ కాస్త నెగిటివ్ యాంగిల్ లో సాగుతోందని.. హీరో పై రివేంజ్ తీర్చుకునే పాత్రలో ఆమె నటిస్తోందని సమాచారం. ఇకపోతే ఈ చిత్రాన్ని దేవ కట్ట మధ్యప్రదేశ్ లో జరిగిన కొన్ని యాధార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించనున్నారట. అన్నట్లు ఈ సినిమాకు ‘రిపబ్లిక్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. జె.భగవాన్, పుల్లారావ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రమ్యకృష్ణ సైతం ఒక కీ రోల్ చేస్తున్నారు. అయితే ఆమెది సాయి తేజ్ మదర్ రోల్ అని టాక్. మరి చూడాలి ఈ సినిమా ఎలా ఉండబోతుందో.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

2 COMMENTS

Comments are closed.

Exit mobile version