https://oktelugu.com/

గూగుల్ డౌన్.. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం

ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్నాలజి దిగ్గజం ‘గూగుల్’ కు కూడా కష్టాలు తప్పలేదు. అంత పెద్ద సంస్థ ఒక్కసారిగా కుప్పకూలింది. సర్వర్ డౌన్ అయిపోయి యూట్యూబ్, జీమెయిల్ సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో ఏం జరుగుతుందో తెలియక ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం అయ్యింది. ఒక్కో దేశంలో అప్పుడప్పుడు ఆయా సంస్థల సర్వర్లు డౌన్ అవడం చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు గూగుల్ సర్వర్లు ప్రపంచవ్యాప్తంగా డౌన్ కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గూగుల్ సర్వీసులు ఆగడంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఇబ్బందులను […]

Written By:
  • NARESH
  • , Updated On : December 14, 2020 6:33 pm
    Follow us on

    ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్నాలజి దిగ్గజం ‘గూగుల్’ కు కూడా కష్టాలు తప్పలేదు. అంత పెద్ద సంస్థ ఒక్కసారిగా కుప్పకూలింది. సర్వర్ డౌన్ అయిపోయి యూట్యూబ్, జీమెయిల్ సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో ఏం జరుగుతుందో తెలియక ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం అయ్యింది.

    ఒక్కో దేశంలో అప్పుడప్పుడు ఆయా సంస్థల సర్వర్లు డౌన్ అవడం చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు గూగుల్ సర్వర్లు ప్రపంచవ్యాప్తంగా డౌన్ కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గూగుల్ సర్వీసులు ఆగడంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఇబ్బందులను ఎదుర్కొనట్టు హెల్త్ ట్రాకర్ డౌన్‌డెటెక్టర్ వెల్లడించింది. అసలు సర్వర్లు ఎందుకు డౌన్ అయ్యాయో గూగుల్ సంస్థ వెల్లడించాల్సి ఉంది. సర్వర్లు డౌన్ అయిన సమయంలో ఇన్‌కాగ్నిటో మోడ్‌లో కొన్ని సర్వీసులు పనిచేసినట్టు వినియోగదారులు చెబుతున్నారు.

    ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం ‘గూగుల్’ సర్వీసులు ఈ సాయంత్రం 5 గంటల నుంచి నిలిచిపోవడంతో ప్రపంచమంతా అల్లకల్లోలం అయ్యింది. సోమ‌వారం సాయంత్రం 5 గంట‌ల నుంచి సేవ‌లు నిలిచిపోయిన‌ట్లు భావిస్తున్నారు.

    అయితే దీనిపై గూగుల్ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ప‌లువురు యూజ‌ర్లు ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ల‌పై యూట్యూబ్‌ను ఓపెన్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా.. స‌ర్వర్‌కు క‌నెక్ట్ కాలేక‌పోతున్నామ‌న్న మెసేజ్ వ‌స్తోంది.