
ఏపీ సీఎం జగన్ రేపు దిల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు అమరావతి నుంచి బయల్దేరి హస్తినకు పయనం కానున్నారు. దిల్లీలో పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో జగన్ సమావేశమయ్యే అవకాశముంది. ముఖ్యంగా కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తోంది. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు, పోలవరం నిధులు తదితర అంశాలపై అమిత్‌షాతో సీఎం చర్చించే అవకాశముంది.