శివుడు చెల్లెలు ఎవరో తెలుసా? పార్వతీదేవి ఆమెను దూరం పెట్టడానికి గల కారణం?

బ్రహ్మ ,విష్ణు ,మహేశ్వరులను త్రిమూర్తులుగా భావిస్తారు. ఈ లోకాన్ని సృష్టించింది బ్రహ్మ అయితే, ఈ సృష్టిని నడిపించేది మాత్రం విష్ణుమూర్తి. ఈ సృష్టిలో నివసించే మానవాళికి మోక్ష కలగాలంటే తప్పకుండా ఆ ఈశ్వరుని నమస్కరించాలి. మన దేశంలో వివిధ ప్రాంతాలలో శివాలయాలు మనకు దర్శనమిస్తాయి. మనం ఎప్పుడూ కూడా శివపార్వతుల గురించి ఎన్నో కథలను వినే ఉంటాము. కానీ శివుడికి ఒక చెల్లెలు ఉందన్న విషయం చాలా మందికి తెలియక పోవచ్చు. అయితే ఆ శివుడి చెల్లెలు […]

Written By: Kusuma Aggunna, Updated On : December 14, 2020 6:36 pm
Follow us on

బ్రహ్మ ,విష్ణు ,మహేశ్వరులను త్రిమూర్తులుగా భావిస్తారు. ఈ లోకాన్ని సృష్టించింది బ్రహ్మ అయితే, ఈ సృష్టిని నడిపించేది మాత్రం విష్ణుమూర్తి. ఈ సృష్టిలో నివసించే మానవాళికి మోక్ష కలగాలంటే తప్పకుండా ఆ ఈశ్వరుని నమస్కరించాలి. మన దేశంలో వివిధ ప్రాంతాలలో శివాలయాలు మనకు దర్శనమిస్తాయి. మనం ఎప్పుడూ కూడా శివపార్వతుల గురించి ఎన్నో కథలను వినే ఉంటాము. కానీ శివుడికి ఒక చెల్లెలు ఉందన్న విషయం చాలా మందికి తెలియక పోవచ్చు. అయితే ఆ శివుడి చెల్లెలు ఎవరు? ఆమెను పార్వతీదేవి ఎందుకు దూరం పెట్టింది? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం….

పురాణాల ప్రకారం ఆ పరమేశ్వరుడు పార్వతీదేవిని వివాహమాడిన తర్వాత సతీ సమేతంగా కైలాసంలో నివసిస్తుంటారు. అయితే కైలాసంలో ఎప్పుడూ ఆ పరమశివుడు ధ్యానంలోనే ఉండటంవల్ల పార్వతి దేవికి ఎంతో ఇబ్బందికరంగా ఉండేది. ఎవరితోనైనా మాట్లాడాలంటే కైలాసంలో ఒక్కరు కూడా మహిళలు ఉండరు. తన హావ భావాలను పంచుకోవడానికి తనకు ఒక ఆడతోడు కావాలని పార్వతి దేవి ఆ పరమేశ్వరుని కోరుతుంది.

పార్వతీదేవి అలా కోరిన వెంటనే ఆ పరమశివుడు తన అంశమైన ఆశావరి అనే అమ్మాయిని తన నుంచి సృష్టిస్తాడు. ఆ అమ్మాయి కూడా అచ్చం పరమేశ్వరుడు లాగే పులిచర్మం, బస్మం ధరించి అచ్చం శివుడి లాగే ఉంటుంది. ఆమెను చూసి సంతోషించిన పార్వతీదేవి తనతో స్నేహం చేస్తుంది. కానీ ఆశావరికి ఆకలి ఎక్కువగా ఉండటం చేత కైలాసంలో ఉన్న ఆహార పదార్థాలను మొత్తం అయి పోతుంటాయి. కేవలం ఆమె వల్ల కైలాసంలో ఉన్న వారికి ఆహారం లేక ఆకలి బాధలు పడుతుంటారు.

ఆశావరి కేవలం భోజనం చేయడమే కాకుండా ఎంతో కోపిష్టిగాను, మొండిగాను ఉండేది. దీంతో ఆమె పట్ల విసుగు చెందిన పార్వతీదేవి ఆ పరమేశ్వరుని దగ్గరకు వెళ్లి స్వయంగా నేనే నాకు ఒక అమ్మాయి కావాలి అని అడిగాను నా తప్పును క్షమించి, ఆశావరిని ఇక్కడి నుంచి పంపించాల్సిందిగా ఆ పరమేశ్వరుడిని వేడుకుంటుంది. అందువల్ల ఆ శివుడు తన చెల్లెలు ఆశావరిని తిరిగి తనలో కలుపుకుంటాడు. ఈ విధంగా శివుడికి కూడా ఒక చెల్లెలు ఉండేది.