యూజర్లకు జియో శుభవార్త… అదిరిపోయే ఫీచర్లతో జియో బ్రౌజర్..?

దేశీయ టెలీకాం దిగ్గజం జియో యూజర్లను ఆకర్షించే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా జియో కొత్త బ్రౌజర్లను లాంఛ్ చేసి వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. జియో పేజెస్ బ్రౌజర్ పేరుతో వచ్చిన ఈ బ్రౌజర్ ప్రాంతీయ భాషలను కూడా సపోర్ట్ చేస్తూ ఉండటంతో యూజర్లు ఇతర బ్రౌజర్లతో పోలిస్తే ఈ బ్రౌజర్ ను వినియోగించడానికి ఎక్కువ ఆసక్తి చూపించే అవకాశాలు ఉన్నాయి. జియోపేజెస్ వెబ్ బ్రౌజర్ క్రోమియం బ్లింక్ పై ఆధారపడి పని చేయనుందని సమాచారం. […]

Written By: Navya, Updated On : October 23, 2020 1:08 pm
Follow us on

దేశీయ టెలీకాం దిగ్గజం జియో యూజర్లను ఆకర్షించే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా జియో కొత్త బ్రౌజర్లను లాంఛ్ చేసి వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. జియో పేజెస్ బ్రౌజర్ పేరుతో వచ్చిన ఈ బ్రౌజర్ ప్రాంతీయ భాషలను కూడా సపోర్ట్ చేస్తూ ఉండటంతో యూజర్లు ఇతర బ్రౌజర్లతో పోలిస్తే ఈ బ్రౌజర్ ను వినియోగించడానికి ఎక్కువ ఆసక్తి చూపించే అవకాశాలు ఉన్నాయి. జియోపేజెస్ వెబ్ బ్రౌజర్ క్రోమియం బ్లింక్ పై ఆధారపడి పని చేయనుందని సమాచారం.

ఇతర బ్రౌజర్లతో పోలిస్తే అధునాతన ఫీచర్లు ఈ బ్రౌజర్ లో ఉండటం గమనార్హం. ఎన్‌క్రిప్టెడ్ కనెక్షన్, ఎమోజీ సపోర్ట్, ఫాస్ట్ లోడింగ్ పేజెస్, ఫాస్ట్ సెర్చ్ ఇంజిన్ లాంటి ఫీచర్లు ఉన్న జియో బ్రౌజర్ ద్వారా యూజర్లకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. యూజర్లు ఈ బ్రౌజర్ లో నచ్చిన భాషను ఎంపిక చేసుకోవచ్చు. ప్రైవసీకి ఈ బ్రౌజర్ లో ఎకువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ బ్రౌజర్ లో సమాచారంపై నియంత్రణ కూడా లభిస్తుంది.

ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని యూజర్లు మిగతా వెబ్ బ్రౌజర్లతో పోలిస్తే మెరుగ్గా పని చేసే ఈ వెబ్ బ్రౌజర్ ను వినియోగించవచ్చు. ఈ బ్రౌజర్ ను హోం స్క్రీన్ లో గూగుల్ తో పాటు ఇతర సెర్చ్ ఇంజిన్లలో నచ్చిన సెర్చ్ ఇంజిన్ ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో లైట్, డార్క్ థీమ్ లు అందుబాటులో ఉండటం వల్ల అవసరమైన సమయంలో డార్క్ మోడ్ ను ఎంచుకుంటే కంటికి శ్రమ కలగదు.

భాష, నచ్చిన అంశాలను ఎంపిక చేసుకుని మనకు నచ్చిన వాటినే చదివే అవకాశం జియో కలిగిస్తోంది. ప్రాంతీయ కంటెంట్ ను కూడా ఎంపిక చేసుకునే అవకాశాన్ని కూడా జియో ఇస్తూ ఉండటం గమనార్హం. ఫైల్ మేనేజ్ మెంట్ భిన్నంగా ఉండే జియో బ్రౌజర్ లో డౌన్ లోడ్ చేసుకున్న ఫైల్స్ అన్నీ ఫైల్ టైప్ కు తగిన విధ్ంగా వేర్వేరు విభాగాల్లో సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నాలుగు అంకెల పిన్ లేదా ఫింగర్ ప్రింట్ లాక్‌ సహాయంతో ఇన్ కాగ్నిటో మోడ్ ను కూడా ఈ బ్రజర్ లో ఉపయోగించవచ్చు.