ఆ బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు.. గూగుల్ పేలో సూపర్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు..?

దేశంలోని ప్రైవేట్ బ్యాంక్ లలో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో శుభవార్త చెప్పింది. మార్కెట్ లోకి మరో కొత్త రకం క్రెడిట్ కార్డును అందుబాటులోకి తెచ్చింది. యాక్సిస్ బ్యాంక్ గూగుల్ పే, వీసా భాగస్వామ్యంతో కస్టమర్లకు ఈ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం.భారత్ లో ఆన్ లైన్ పేమెంట్ల కోసం ఎక్కువగా వినియోగించే యాప్ లలో గూగుల్ పే ఒకటనే సంగతి తెలిసిందే. వేర్వేరు ఆఫర్లతో గూగుల్ పే వినియోగదారులకు […]

Written By: Navya, Updated On : October 15, 2020 9:26 am
Follow us on

దేశంలోని ప్రైవేట్ బ్యాంక్ లలో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో శుభవార్త చెప్పింది. మార్కెట్ లోకి మరో కొత్త రకం క్రెడిట్ కార్డును అందుబాటులోకి తెచ్చింది. యాక్సిస్ బ్యాంక్ గూగుల్ పే, వీసా భాగస్వామ్యంతో కస్టమర్లకు ఈ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం.భారత్ లో ఆన్ లైన్ పేమెంట్ల కోసం ఎక్కువగా వినియోగించే యాప్ లలో గూగుల్ పే ఒకటనే సంగతి తెలిసిందే. వేర్వేరు ఆఫర్లతో గూగుల్ పే వినియోగదారులకు రోజురోజుకు దగ్గరవుతోంది.

గూగుల్ పేతో భాగస్వామ్యం ద్వారా యాక్సిస్ బ్యాంక్ తమ క్రెడిట్ కార్డ్ వాడే గూగుల్ పే కస్టమర్లకు అపరిమిత క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఏస్ క్రెడిట్ కార్డు పేరుతో యాక్సిస్ బ్యాంక్ తీసుకొచ్చిన ఈ క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపులు, మొబైల్ రీఛార్జ్ లపై అదిరిపోయే క్యాష్ బ్యాక్ అందిస్తోంది. మిగతా క్రెడిట్ కార్డులకు ఈ క్రెడిట్ కార్డులకు తేడా ఏమిటంటే ఈ క్రెడిట్ కార్డులకు క్యాష్ బ్యాక్ విషయంలో ఎలాంటి పరిమితులు లేవు.

క్యాష్ బ్యాక్ విషయంలో పరిమితులు లేకపోవడం వల్ల మొబైల్ రీచార్జ్, బిల్లుల చెల్లింపులపై సులభంగా ఐదు శాతం క్యాష్ బ్యాక్ ను పొందే అవకాశం ఉంటుంది. అన్ని రకాల బిల్ పేమెంట్ల కోసం ఈ కొత్త క్రెడిట్ కార్డును వినియోగించవచ్చు. ఈ క్రెడిట్ కార్డులు మిగతా క్రెడిట్ కార్డులతో పోలిస్తే ఆఫర్లను అందిస్తూ ఉండటం గమనార్హం. ఓలా, జొమాటో, స్విగ్గీ, ఇతర లావాదేవీలపై కూడా యాక్సిస్ బ్యాంక్ క్యాష్ బ్యాక్ అందిస్తూ ఉండటం గమనార్హం.

గ్రోఫర్స్, బిగ్ బాస్కెట్ వంటి వాటిలో కూడా 5 శాతం క్యాష్‌ బ్యాక్ ను పొందవచ్చు. అయితే క్యాష్ బ్యాక్ విషయంలో యాక్సిస్ బ్యాంక్ కొన్ని నియమనిబంధనలు విధించింది. 2020 డిసెంబర్ 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డ్ పొందడానికి 499 రూపాయలు జాయినింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. కార్డు పొందిన 45 రోజుల్లో 10,000 రూపాయలు ఖర్చు చేస్తే మాత్రమే 499 రూపాయల క్యాష్ బ్యాక్ లభిస్తుంది.