https://oktelugu.com/

తెలంగాణలో అంత్యక్రియలకు ముందు మూలిగిన యువతి.. చివరకు..?

తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లిలో ఒక యువతి అంత్యక్రియలకు ముందు గట్టిగా మూలిగింది. దీంతో యువతి తల్లిదండ్రులు ఆమె బ్రతికే ఉందనే ఆశతో సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆస్పత్రిలో వైద్యులు యువతిని పరిశీలించి ఆమె చనిపోయిందని వెల్లడించారు. దీంతో యువతి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. యువతి బ్రతికిందని ఆనందించే లోపు చనిపోయిందని వైద్యులు చెప్పడంతో యువతి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే జిల్లాలోని మహదేవపూర్‌ మండలం కుదురుపల్లి గ్రామంలో లక్ష్మయ్య లక్ష్మీ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 15, 2020 9:18 am
    Follow us on

    తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లిలో ఒక యువతి అంత్యక్రియలకు ముందు గట్టిగా మూలిగింది. దీంతో యువతి తల్లిదండ్రులు ఆమె బ్రతికే ఉందనే ఆశతో సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆస్పత్రిలో వైద్యులు యువతిని పరిశీలించి ఆమె చనిపోయిందని వెల్లడించారు. దీంతో యువతి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. యువతి బ్రతికిందని ఆనందించే లోపు చనిపోయిందని వైద్యులు చెప్పడంతో యువతి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

    పూర్తి వివరాల్లోకి వెళితే జిల్లాలోని మహదేవపూర్‌ మండలం కుదురుపల్లి గ్రామంలో లక్ష్మయ్య లక్ష్మీ దంపతుల కూతురు గీతాంజలి ప్రస్తుతం డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతోంది. గత కొన్ని రోజులుగా గీతాంజలి తీవ్ర జ్వరంతో బాధ పడుతోంది. నిరుపేద కుటుంబం కావడంతో లక్ష్మయ్య లక్ష్మీ దంపతులు ఆర్‌ఎంపీ వైద్యుడితో గీతాంజలికి చికిత్స చేయించారు. అయితే ఎన్ని మందులు వాడినా గీతాంజలికి జ్వరం తగ్గలేదు.

    జ్వరంతో బాధ పడుతున్నప్పటికీ ఇంటి పనులు చేస్తున్న గీతాంజలి నిన్న ఉదయం చలనం లేకుండా ఉండిపోయింది. యువతిలో చలనం లేకపోవడంతో యువతి తల్లిదండ్రులు గీతాంజలి చనిపోయిందని భావించారు. అంత్యక్రియలకు తీసుకెళుతున్న సమయంలో యువతి నుంచి గట్టిగా మూలిగిన శబ్దం వచ్చింది.

    యువతి కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మహదేవ్ పురలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు అంత్యక్రియలను పూర్తి చేశారు. చనిపోయిందనుకున్న యువతి మళ్లీ లేవడం స్థానికంగా చర్చనీయాంశం ఆయింది.