2020 సంవత్సరంలో బంగారం ధర భారీగా పెరగడం తగ్గడం జరిగింది. కరోనా విజృంభణ తీవ్రంగా ఉన్న ఆగష్టు నెలలో 24 క్యారెట్ల బంగారం ధర 59,310 రూపాయలకు చేరింది. గత కొన్ని రోజుల నుంచి కరోనా వ్యాక్సిన్ల గురించి వినిపిస్తున్న వార్తల వల్ల పసిడి ధర క్రమంగా తగ్గుతోంది. 2021 సంవత్సరంలో సైతం బంగారం ధర తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మార్కెట్ లో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 50,940 రూపాయలుగా ఉంది.
Also Read: రెండు మూడు క్రెడిట్ కార్డులు వాడుతున్నారా.. చేయకూడని తప్పులివే..?
ఆగష్టు నెలకు, డిసెంబర్ నెలకు బంగారం ధరలో ఏకంగా 8,000 రూపాయలు ధరలో వ్యత్యాసం ఉండటం గమనార్హం. అయితే బంగారం ధరపై వేర్వేరు అంశాలు ప్రభావం చూపుతుంటాయి. అయితే 2021లో మాత్రం బంగారం ధర ఇదే విధంగా ఉండవచ్చని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బంగారం ధరలో స్వల్పంగా మాత్రమే మార్పులు ఉంటాయని అందువల్ల ధరలు పెరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
Also Read: 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి వ్రతం ఆచరిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
పసిడిపై పెట్టుబడులు పెట్టాలని అనుకునే వాళ్లు బంగారానికి బదులుగా ఈక్విటీ మార్కెట్లను ఎంచుకుంటే మంచిదని.. 2021లో ఈక్విటీ మార్కెట్లు మంచి లాభాలు ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయని కానీ ధరలు మాత్రం తగ్గవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది కరోనా మహమ్మారి పసిడి ధరలు పెరగడానికి కారణమైంది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
అయితే ఎవరైనా బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటే ఇప్పుడు కొనుగోలు చేయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న రేటుతో పోలిస్తే బంగారం ధర తగ్గే అవకాశాలు లేవని అందువల్ల గడిచిన 5 నెలలలో ఏకంగా 8 వేల రూపాయలు బంగారం ధర తగ్గింది కాబట్టి పసిడి కొనుగోలుకు ఇదే సరైన సమయమని చెప్పవచ్చు.