రెండు మూడు క్రెడిట్ కార్డులు వాడుతున్నారా.. చేయకూడని తప్పులివే..?

కరోనా విజృంభణ, లాక్ డౌన్ తర్వాత క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగింది. ప్రజలు సైతం నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే చాలామంది అవసరాలను బట్టి ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. అయితే నిపుణులు మాత్రం ఎన్ని అవసరాలు ఉన్నా ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను వినియోగించవద్దని సూచిస్తున్నారు. క్రెడిట్ కార్డు అంటే బ్యాంకు నుంచి రుణం తీసుకున్నట్టు భావించాలని నిపుణులు చెబుతున్నారు. Also Read: బీమా పాలసీలను తీసుకుంటున్నారా.. […]

Written By: Navya, Updated On : December 26, 2020 11:19 am
Follow us on


కరోనా విజృంభణ, లాక్ డౌన్ తర్వాత క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగింది. ప్రజలు సైతం నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే చాలామంది అవసరాలను బట్టి ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. అయితే నిపుణులు మాత్రం ఎన్ని అవసరాలు ఉన్నా ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను వినియోగించవద్దని సూచిస్తున్నారు. క్రెడిట్ కార్డు అంటే బ్యాంకు నుంచి రుణం తీసుకున్నట్టు భావించాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read: బీమా పాలసీలను తీసుకుంటున్నారా.. చేయకూడని తప్పులు ఇవే..?

ఎక్కువ క్రెడిట్ కార్డులను వినియోగించడం వల్ల సాధారణంగా చేసే ఖర్చులతో పోలిస్తే ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆఫర్ల కోసం ఎక్కువ క్రెడిట్ కార్డులను తీసుకుంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నెలలో క్రెడిట్ కార్డును ఎంత ఆలస్యంగా వినియోగిస్తే వడ్డీ లేని కాలవ్యవధి అంత తగ్గుతుంది. ఒకటికి మించి క్రెడిట్ కార్డులను కలిగి ఉన్నా ఖర్చుల కోసం అత్యవసర పరిస్థితుల్లో మినహా మిగిలిన సమయాల్లో రెండో కార్డును వినియోగించుకోకపోవడమే మంచిది.

Also Read: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. జనవరి నెలలో బ్యాంకు సెలవులివే..?

చాలామంది ఒక క్రెడిట్ కార్డ్ అమౌంట్ ను మరో క్రెడిట్ కార్డ్ బిల్లును చెల్లించడానికి వినియోగిస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల కూడా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. మనం ఖర్చు చేసే విధానాలను బట్టి క్రెడిట్ కార్డులను ఎంచుకుంటే మంచిది. కొన్ని సందర్భాల్లో క్రెడిట్ కార్డ్ బాగానే ఉన్నా వివిధ కారణాల వల్ల పని చేయకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో రెండో క్రెడిట్ కార్డును వినియోగించడం మంచిది.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

ఒకటికి మించి క్రెడిట్ కార్డులను కలిగి ఉన్నా వాటిని సరైన విధంగా వినియోగిస్తే మాత్రమే ప్రయోజనాలు చేకూరుతాయి. ఎక్కువ క్రెడిట్ కార్డులను తీసుకుంటే క్రెడిట్ యుటిలైజేషన్ స్కోర్ పై తీవ్రంగా పడుతుంది. అందువల్ల ఒక క్రెడిట్ కార్డునే వినియోగిస్తే ఇబ్బందులు పడకుండా తప్పించుకోవచ్చు.