బంగారం ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు..?

ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపే వారి సంఖ్య ఎక్కువని తెలిసిందే. బంగారంపై ఇష్టం ఉన్నా రోజురోజుకు బంగారం రేట్లు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో చాలామంది బంగారం కొనుగోలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే గత మూడు రోజులుగా బంగారం ధర అంతకంతకూ తగ్గుతుండటంతో బంగారం కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమని చెప్పాలి. ఎవరైనా పెళ్లిళ్ల కోసం, ఇతారత్రా కారణాల వల్ల బంగారం కొనుగోలు చేయాలనుకుంటే […]

Written By: Navya, Updated On : November 19, 2020 10:03 am
Follow us on


ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపే వారి సంఖ్య ఎక్కువని తెలిసిందే. బంగారంపై ఇష్టం ఉన్నా రోజురోజుకు బంగారం రేట్లు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో చాలామంది బంగారం కొనుగోలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే గత మూడు రోజులుగా బంగారం ధర అంతకంతకూ తగ్గుతుండటంతో బంగారం కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమని చెప్పాలి.

ఎవరైనా పెళ్లిళ్ల కోసం, ఇతారత్రా కారణాల వల్ల బంగారం కొనుగోలు చేయాలనుకుంటే కొనుగోలు చేస్తే మంచిది. బులియన్ మార్కెట్ నిపుణులు ఫైజర్ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో మంచి ఫలితాలు సాధించడంతో బంగారం రేట్లు క్రమంగా తగ్గుతున్నట్టు చెబుతున్నారు. వ్యాక్సిన్ తుది దశ క్లినికల్ ట్రయల్స్ లో 95 శాతం సత్ఫలితాలు సాధించడంతో బంగారం ధర దిగొస్తుంది. అయితే మళ్లీ రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఒకవైపు పసిడి ధర క్రమంగా తగ్గుతుంటే మరోవైపు వెండి ధర మాత్రం ఆకాశాన్ని తాకుతుండటం గమనార్హం. వెండికి డిమాండ్ భారీగా పుంజుకోవడంతో వెండి ధర ఏకంగా 68,300 రూపాయలకు చేరింది. బంగారం విషయానికి వస్తే హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 51,630 రూపాయలుగా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,300 రూపాయలుగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్ లో సైతం బంగారం ధర తగ్గడం గమనార్హం. ధర ఔన్స్ కు 0.10 శాతం తగ్గడంతో 1869 డాలర్ల క్షీణత నమోదైంది. వెండి ధర సైతం క్రమంగా తగుతూ 24.32 డాలర్లకు క్షీణించడం గమనార్హం. ప్రపంచ దేశాల్లో జరిగే కీలక పరిణామాలు, బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, ఇతర అంశాలు బంగారం ధరపై ప్రభావ్నం చూపిస్తాయి.