జీహెచ్ఎంసీ అప్డేట్: పోలింగ్ ప్రారంభం.. ఓటర్ల బారులు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఈసారి గ్రేటర్ బరిలో 150 డివిజన్లకు గాను 1122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. Also Read: గ్రేటర్ వార్.. ఎన్నికలపై ఉపాధ్యాయుల ఎఫెక్ట్ పడనుందా? పోలింగ్ ప్రశాంతంగా జరిపేందుకు 50వేలమందికి పైగా పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 60 ఫ్లయింగ్ స్క్వాడ్ లు , 30 స్టాటిస్టిక్ సర్వేలెన్స్ టీములు నియమించారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల […]

Written By: NARESH, Updated On : December 1, 2020 11:23 am
Follow us on

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఈసారి గ్రేటర్ బరిలో 150 డివిజన్లకు గాను 1122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Also Read: గ్రేటర్ వార్.. ఎన్నికలపై ఉపాధ్యాయుల ఎఫెక్ట్ పడనుందా?

పోలింగ్ ప్రశాంతంగా జరిపేందుకు 50వేలమందికి పైగా పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 60 ఫ్లయింగ్ స్క్వాడ్ లు , 30 స్టాటిస్టిక్ సర్వేలెన్స్ టీములు నియమించారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో అతిపెద్ద డివిజన్ మైలార్ దేవ్ పల్లి కాగా.. అతిచిన్న డివిజన్ రాంచంద్రాపురం.

ఓటింగ్ కోసం మొత్తం 18202 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. పలు కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ కు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ విధుల్లో 36 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు.

గ్రేటర్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 74,67,256 మంది. ఇక పోలింగ్ కోసం ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు బారులు తీరారు. జంట నగరాల పరిధిలో 9101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.

Also Read: బల్దియాలో చివరగా బ్యాలెట్ ఎన్నిక ఎప్పుడు జరిగిదంటే?

గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ 150 స్థానాల్లో పోటీచేస్తుండగా.. బీజేపీ -149, కాంగ్రెస్-146 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఇక టీడీపీ -106, ఎంఐఎం-51 స్థానాల్లో అభ్యర్థులను నిలిపాయి. సీపీఐ-17, సీపీఎం-12, ఇతర పార్టీలు -76, స్వతంత్రులు-415 మంది పోటీలో ఉన్నారు.

*ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్, కిషన్ రెడ్డి

  • పోలింగ్ ప్రారంభమైన వెంటనే మంత్రి కేటీఆర్ దంపతులు బంజారాహిల్స్ లోని  నందినగర్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • ఇక కాచిగూడలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దంపతులు ఓటుహక్కు వినియోగించుకున్నారు.
  • జూబ్లిహిల్స్ లోని జూబ్లీ క్లబ్ పోలింగ్ కేంద్రంలో ప్రముఖ నటుడు చిరంజీవి దంపతులు ఓటు వేశారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్