టాలీవుడ్ నటులు, వారిపై చర్యలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో తీసుకున్నారు. నటుడు నాగార్జున కన్వేన్షన్ ను కేసీఆర్ సర్కార్ మొదట్లో కూల్చేసింది. అయితే ఆ తర్వాత టాలీవుడ్ పెద్దలు గులాబీ నేతలతో సన్నిహితంగా మెలగడంతో దాడులు, చర్యలు తీసుకోలేదు.
Also Read: హైకోర్టు న్యాయవాది వామనరావు ఎవరు? ఎలాంటి వారు? ఎందుకు చంపారు?
అయితే చాలా రోజులకు ప్రముఖ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబుపై టీఆర్ఎస్ సర్కార్ చర్య తీసుకుంది. ఆయనకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు ఝలక్ ఇచ్చారు . ఏకంగా రూ. లక్ష రూపాయల జరిమానా విధించారు.
జీహెచ్ఎంసీ చట్టంలోని నిబంధనలకు ఉల్లంఘించినందుకు నటుడు మోహన్ బాబుకు ఈ జరిమానా విధించినట్టు నోటీసుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద ఉన్న బస్టాప్ ఎదురుగా మోహన్ బాబు ఇల్లు ఉంది. ఆయన ఇంటి ప్రహరీకి ఎత్తైన అడ్వటైజ్ మెంట్ బోర్డును కొన్నాళ్ల క్రితం అమర్చారు. ఏకంగా అది 15 అడుగుల ఎత్తులో ఆ బోర్డు ఉండడంతో అధికారులు అభ్యంతరం తెలిపారు. దీనిపై కొందరు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేయగా.. వారు తాజాగా చర్యలు తీసుకున్నారు.
Also Read: సంచలన నిజాలు: హైకోర్టు లాయర్ దంపతుల హత్యకు అసలు కారణాలేంటి?
ఇప్పటిదాకా చాలా ఫిర్యాదులు వచ్చినా టాలీవుడ్ ప్రముఖులపై చర్యలు తీసుకోవడానికి టీఆర్ఎస్ సర్కార్, జీహెచ్ఎంసీ వెనుకాడింది. కానీ చాలా రోజుల తర్వాత మోహన్ బాబుపై చర్య తీసుకోవడం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్