https://oktelugu.com/

అమరావతి పునాదికి ఐదేళ్లు

ఐదేళ్ల క్రితం సరిగా ఇదే రోజు.. ఎంతో ఆర్భాటంగా అమరావతి రాజధానికి ఫౌండేషన్‌ వేశారు. అమరావతి రాజధానికి అప్పటి సీఎం చంద్రబాబు నిర్ణయించగా.. అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ కూడా దానికి అంగీకరించారు. అసెంబ్లీ సాక్షిగా స్వాగతించారు. చివరకు ప్రధాని చేతుల మీదుగా ఈ ఉత్సవం నడిచింది. ఆ సమయంలో కొత్త రాజధానికి భూమిపూజ చేసిన మోడీ కూడా ప్రపంచంలో మేటి రాజధాని కావాలని ఆశీర్వదించారు. Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. రాష్ట్రంలో […]

Written By:
  • NARESH
  • , Updated On : October 22, 2020 / 12:38 PM IST
    Follow us on

    ఐదేళ్ల క్రితం సరిగా ఇదే రోజు.. ఎంతో ఆర్భాటంగా అమరావతి రాజధానికి ఫౌండేషన్‌ వేశారు. అమరావతి రాజధానికి అప్పటి సీఎం చంద్రబాబు నిర్ణయించగా.. అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ కూడా దానికి అంగీకరించారు. అసెంబ్లీ సాక్షిగా స్వాగతించారు. చివరకు ప్రధాని చేతుల మీదుగా ఈ ఉత్సవం నడిచింది. ఆ సమయంలో కొత్త రాజధానికి భూమిపూజ చేసిన మోడీ కూడా ప్రపంచంలో మేటి రాజధాని కావాలని ఆశీర్వదించారు.

    Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. రాష్ట్రంలో 2,624 వాలంటీర్ల ఉద్యోగాలు..?

    తెలుగుదేశం పార్టీ కూడా అమరావతి రాజధానిని ప్రకటించి..ఆ వెంటనే పూజా కార్యక్రమాలు పూర్తిచేశారు. అయితో.. భూ సేకరణ చేసి పనులు ప్రారంభించే సరికి 16 నెలలు గడిచింది. ఈ సమయంలో కొండవీడు ఎత్తిపోతల నిర్మించిన తర్వాతే రాజధాని నిర్మాణం చేపట్టాలని ఎన్జీటీ ఆదేశించింది. ఆ ఆదేశాలతో శరవేగంగా ఎత్తిపోతలు నిర్మించారు. నిర్మాణాలు ప్రారంభించే సరికి.. మరో ఏడాది గడిచిపోయింది. ఆ తర్వాత రెండున్నరేళ్లలోనే అమరావతి ఓ రూపానికి వచ్చింది. ఇప్పుడు.. అమరావతిలో కనించేవన్నీ.. ఆ కొద్ది కాలంలో నిర్మించినవే. బాబు పాలన చివరి వరకూ ఆ వేగం కొనసాగిస్తే అప్పటికే ఆ రాజధాని నిర్మాణం పూర్తయ్యేది. ఎంతో మందికి ఉపాధి దొరుకుతుండేది.

    కానీ ఇప్పుడా ఆశల సౌధం కుప్పకూలింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం అమరావతి ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నంలో బిజీగా ఉంది. స్వయం నాశనం అనే పదానికి విస్తృతమైన అర్థం తెలియచెబుతున్నారు. అప్పుడు భూమి పూజ కార్యక్రమానికి హాజరైన మోడీ కూడా చాలా గొప్పగా చెప్పారు. పార్లమెంట్‌ వద్ద సేకరించిన పవిత్ర మట్టిని తీసుకొచ్చామని తెలిపారు. అంతేకాదు.. పవిత్ర యమునా నది నుంచి పవిత్ర జలాన్ని తెచ్చానని ప్రధాని ప్రకటించారు. ఢిల్లీని తలదన్నే విధంగా ఏపీ రాజధాని అమరావతిని తీర్చిదిద్దుతామని ప్రధాని మోడీ ఐదు కోట్ల ఆంధ్రులకు ఆనాడు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏపీ సర్కార్ పనులకు మోడీ మద్దతు పలుకుతున్నారు. ఏకంగా రాజధానితో కేంద్రానికి సంబంధం లేదంటున్నారు.

    Also Read: బీజేపీ సోషల్ మీడియాపై భగ్గుమంటున్న హరీశ్

    మరి మోడీ ఇలా మాట మార్చడంపై ఉన్న మతలబు ఏంటి..? జగన్‌ తీసుకున్న నిర్ణయానికి అంగీకరించడం ఏంటి..? రాజధాని అంశం తమ పరిధిలోకి రాదని చెప్పడం ఏంటి..? జగన్‌ అధికారంలోకి వచ్చిన రాజధాని మార్పు తీసుకున్న నాటి నుంచి అక్కడి ప్రజల్లో వస్తున్న ప్రశ్నలివి. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మాత్రం ఇంతవరకు ఓ రాజధాని ఏర్పాటు కాకపోవడం సిగ్గు పడాల్సిన విషయమే.