Homeఅత్యంత ప్రజాదరణమోడితో కయ్యమే 'కాళేశ్వరం'కు బ్రేకులా..!

మోడితో కయ్యమే ‘కాళేశ్వరం’కు బ్రేకులా..!

kcr fight with modi
kcr fight with modi

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలల ప్రాజెక్టు ‘కాళేశ్వరం’పై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ షాక్‌ ఇచ్చింది. గోదావరి నదిపై తెలంగాణ సరిహద్దుల్లో నిర్మించిన ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగాయని తెలిపింది. జలశక్తిత ఆదేశాలకు అనుగుణంగా విస్తరణ పనులు చేపట్టాలని, తదుపరి ఆదేశాలు వచ్చిన తరువాత మిగతా పనులు చేపట్టరాదని ఎన్జీటీ ఆదేశించింది. ఈ ప్రాజెక్టుతో విస్తృత ప్రయోజనాలున్నా పర్యావరణం కూడా అవసరమేనని తెలిపింది. పర్యావరణ ప్రభావంపై తీసుకోవాల్సిన చర్యలకు ఏడుగురు సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణశాఖను ఆదేశించింది. నిర్వాసితులకు పునరావాసం, పరిహారం విషయాలపై అధ్యయనం చేయాలని సూచించింది.

Also Read: వరద బాధితులకు టాలీవుడ్ ప్రముఖుల భారీ విరాళం

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పర్యావరణ అనుమతుల్లో కేసీఆర్‌ అతిక్రమించాల్సిన అవసరం ఏముందని ఇప్పుడో చర్చ మొదలైంది. అయినా ఇన్నాళ్లు ఎన్‌జీటి ఎందుకు పట్టించుకోలేదనే వాదనలు కూడా వస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల వ్యయం ఎక్కువశాతం కేంద్రానిదే ఉంటుందని, కేంద్రం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర నిధులతోనే ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నామని టీఆర్‌ఎస్‌ నాయకులు చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు పర్యావరణాన్ని పట్టించుకోకుండా జెట్‌ స్పీడ్‌లో ప్రాజెక్టును నిర్మించాల్సిన అవసరం ఏముంది..? అయితే దాదాపు ఈ ప్రాజక్టు పూర్తి కావొచ్చింది. ఎన్‌జీటీ సైతం ఇన్నాళ్లు ప్రాజెక్టు పనులు సాగుతుండగా ఎందుకు చూస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నారు. దీంతో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు రాజకీయంగా ముడిపడిందా..? అన్న చర్చ సాగుతోంది. మోడితో కయ్యమే కేసీఆర్‌ కలల ప్రాజెక్టుకు దెబ్బ పడిందా..? అని అనుకుంటున్నారు.

ఇన్నాళ్లు ఢిల్లీలో బీజేపీతో దోస్తీ కట్టి రాష్ట్రానికి రాగానే మోడిపై విమర్శలు చేసే కేసీఆర్‌ ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తాడోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయి బిల్లుకు కేసీఆర్‌ మద్దతు ఇవ్వలేదు. పైగా మోడి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై తీవ్రంగా విమర్శలు కూడా చేశాడు. దీంతో ఇప్పుడు కేసీఆర్‌ మానస పుత్రికగా పేర్కొంటున్న ‘కాళేశ్వరం ప్రాజెక్టు’కోసం కేంద్రంతో కయ్యం పెట్టుకుంటాడా..? లేక మళ్లీ పొగడ్తల వర్షం కురిపిస్తాడా అనేది చూడాలి..?

Also Read: కరోనా-వర్షాలతో శోభ తగ్గిన బతుకమ్మ..!

మరో వైపు నరేంద్ర మోడి సైతం వ్యవసాయ బిల్లుకు టీఆర్‌ఎస్‌ మద్దతు ఇవ్వపోవడంపై కాచుకొని కూర్చున్నారు. దీంతో ఆయన ఏకంగా కాళేశ్వరం ప్రాజెక్టుపైనే కన్నేశారు. పర్యావరణ అనుముతులు ఉల్లంఘించారని ఎన్టీజీ ద్వారా చెప్పించారు. ఇప్పుడు ఈ పంచాయితీ కేంద్రం దృష్టికి వెళ్లింది. కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రసన్నం చేసుకొని ప్రాజెక్టు అనుమతులు తెచ్చుకుంటాడోనని రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

Comments are closed.

Exit mobile version