గబ్బర్ మరో రికార్డు సృష్టించాడు. దుబాయి వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్‌లో ఇండియన్ స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ చరిత్ర లిఖించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న గబ్బర్ వరుసగా రెండు మ్యాచుల్లో సెంచరీలు చేసికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఈ రెండు మ్యాచుల్లో ధావన్ నాటౌట్‌గా నిలవడం మరో విశేషం. గత మ్యాచులో 101 పరుగులు చేసిన గబ్బర్, నిన్నటి మ్యాచులో 106 రన్స్ చేశాడు.
Also Read: సన్ రైజర్స్ గెలవాలంటే ఇవి చేయాల్సిందే?
ఐపీఎల్ లీగ్‌లో సెంచరీ కొట్టడమే గ్రేట్ అనుకుంటే.. వరుసగా రెండు మ్యాచుల్లోనూ రెండు శతకాలు కొట్టిన తొలి వీరుడుగా గబ్బర్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇలా వరుస మ్యాచుల్లో సెంచరీలు చేసిన తొలి ఐపీఎల్ క్రీడాకారుడిగా తన పేరు నమోదు చేసుకున్నాడు. ఇవాళ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధావన్ 57 బంతుల్లో100 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 3 భారీ సిక్సులు ఉన్నాయి. ఇంతకు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ జరగగా 58 బంతుల్లో 101 పరుగులు చేశాడు ధావన్.
అంతేకాదు.. ఈ ఐపీఎల్ వేదిక శిఖర్ మరో ఘనత సాధించాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో 5000 పరుగులు పూర్తి చేశాడు. దీంతో 5000 మార్క్ సాధించిన నాలుగో భారతీయ క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. గత సీజన్‌లో సురేశ్ రైనా 5000 పరుగుల క్లబ్‌లో చేరిన తొలి ఆటగాడిగా నిలవగా.. తర్వాత విరాట్ కోహ్లి సైతం ఈ క్లబ్‌లో చేరాడు.
Also Read: మూడు సూపర్ ఓవర్లు.. ఐపీఎల్ నరాలు తెంపేసింది..
178 ఇన్నింగ్స్‌ల్లో 5,759 రన్స్ చేసిన కోహ్లి.. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్‌కు దూరమైన రైనా.. 189 ఇన్నింగ్స్‌ల్లో 5,149 రన్స్ చేశాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సీజన్లోనే 5 వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. ఐపీఎల్‌లో 191 ఇన్నింగ్స్ ఆడిన హిట్ మ్యాన్ 5149 రన్స్ చేశాడు.