బీహార్ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భవితవ్యం మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే జైలు జీవితం గడుపుతున్న ఆయన.. మరిన్ని రోజులు జైల్లోనే ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఆయనకు ఇప్పట్లో బెయిల్ కూడా వచ్చే అవకాశం లేదని అంటున్నారు నిపుణులు.
Also Read: ఫరూక్ అబ్దుల్లా.. నువ్వు అసలు భారతీయుడివేనా?
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై ఇప్పటికే చాలా కేసులున్నాయి. పశుగ్రాసం కుంభకోణంతోపాటు డుమ్కా ట్రెజరీ కుంభకోణం కేసులో కూడా లాలూ ప్రసాద్ యాదవ్ నిందితుడిగా ఉన్నారు. దీంతో ఆయన జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే పశుగ్రాసం కుంభకోణంలో లాలూకు బెయిల్ లభించింది. డుమ్కా ట్రెజరీ కేసులోనూ లాలూ యాదవ్ కు బెయిల్ లభిస్తుందని ఆర్జేడీ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల ఫలితాల నాటికి జైలు నుంచి విడుదల అవుతారని ఆయన కుటుంబ సభ్యులూ కూడా భావించారు. అయితే ఈ కేసును ఈ నెల 27వ తేదీకి వాయిదా వేయడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
ఆర్జేడీకి అధినేత అయినప్పటికీ లాలూ మూడేళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్నారు. 1990లో బీహార్‌లో పశుగ్రాసం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు సుదీర్ఘంగా విచారణ సాగింది. అయితే.. 2017లో శిక్ష పడడంతో అప్పటి నుంచి జైలుకే పరిమితమయ్యారు. అయితే.. ఆయనకు ఇప్పటికే పశుగ్రాసం కుంభకోణంలో బెయిల్ లభించడంతో కుటుంబంతోపాటు ఆర్జేడీ క్యాడర్ కూడా ఊపిరి పీల్చుకుంది.
Also Read: మద్యం తాగేవారికి షాకింగ్ న్యూస్.. పదేళ్లు జైలు శిక్ష..?
అయితే.. ఇప్పుడు డుమ్కా ట్రెజరీ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ లభించలేదు. ఆయన మరికొంతకాలం జైలులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాలూ ప్రసాద్ యాదవ్ పై కక్ష సాధింపుతోనే కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగిందని బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ ప్రధాన ప్రచారంగా వాడుకుంది. లాలూ యాదవ్‌కు బెయిల్ లభించకపోవడంతో ఆర్జేడీ వర్గాలు పూర్తి నిరాశలో మునిగిపోయాయి.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్