కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన పార్లమెంట్ సమావేశాల్లో కొత్తగా వ్యవసాయ సంస్కరణ పేరిట మూడు బిల్లులను తీసుకొచ్చింది. ఈ బిల్లుల వల్ల రైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం చెబుతుండగా.. రైతులు మాత్రం తమకు నష్టమే వాటిల్లితుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ట్రిపుల్ ఐటీ మెరిట్ జాబితా ఎప్పుడంటే..?
వ్యవసాయ సంస్కరణ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్.. హర్యానా.. యూపీ రైతులు గత కొద్దిరోజలుగా ఢిల్లీలో నిరసనలు చేపడుతున్నారు. ఈక్రమంలోనే పలుమార్లు కేంద్రం రైతులతో చర్చలు జరిపినా ఫలితం రావడం లేదు. కేంద్రం.. రైతు సంఘాల నాయకులు ఎవరికీ వారు మంకుపట్టు పట్టడంతో చర్చలు కొలిక్కి రావడం లేదు.
దీంతో రైతులు భారత్ బంద్.. రోడ్ల దిగ్భంధం.. ఆందోళనలు చేస్తుండటంతో ఢిల్లీవాసులకు మరిన్ని ఇబ్బందులు ఏర్పడుతోన్నాయి. అయితే రైతు ఆందోళనలకు ఆప్ సర్కార్ పూర్తి మద్దతు ప్రకటించింది. ఇటీవల రైతు సమస్యలపై ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై కొత్త వ్యవసాయ సంస్కరణకు వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది.
Also Read: రేషన్ సరుకులు తీసుకోకపోతే కార్డు రద్దు.. నిజమేనా..?
రైతుల ఆందోళనలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తుండంతో రైతు సంఘాల నాయకులు సైతం దీక్షలు కొనసాగిస్తున్నారు. మూడు డిగ్రీల చలిలోనూ రైతులు తమ పోరాటాన్ని ఆపకుండా ముందుకెళుతున్నారు. దీంతో ఇప్పటికే 24మంది రైతులు వివిధ కారణాలతో మృతిచెందాడం శోచనీయంగా మారింది.
ఇక రైతులు కొద్దిరోజులుగా చేపడుతున్న దీక్షలు రేపటితో 25వ రోజుకు చేరుకుంటున్నాయి. దీంతో రేపు దేశవ్యాప్తంగా రైతుల మృతికి శ్రధ్దాంజలి ఘటించనున్నారు. ఇకనైనా కేంద్రం రైతులతో పంతానికి వెళ్లకుండా దీక్షలు విరమించేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్