https://oktelugu.com/

పెళ్లెప్పుడంటే… కొట్టేస్తా అంటున్న సింగర్ సునీత

పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లలు ఉన్న 42 ఏళ్ల సునీత రెండో పెళ్లి వార్త టాలీవుడ్ ని షాక్ చేసింది. ఓ మీడియా సంస్థ యజమాని అయిన రామ్ వీరపనేనితో ఆమె నిశ్చితార్ధం జరిగింది. కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్న సునీత నిశ్చితార్ధ వేడుక అత్యంత నిరాడంబరంగా జరిగింది. సునీత పిల్లలు మరియు ఇరు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తరువాత సునీత ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. పిల్లలతో పాటు తన […]

Written By:
  • admin
  • , Updated On : December 19, 2020 / 12:12 PM IST
    Follow us on


    పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లలు ఉన్న 42 ఏళ్ల సునీత రెండో పెళ్లి వార్త టాలీవుడ్ ని షాక్ చేసింది. ఓ మీడియా సంస్థ యజమాని అయిన రామ్ వీరపనేనితో ఆమె నిశ్చితార్ధం జరిగింది. కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్న సునీత నిశ్చితార్ధ వేడుక అత్యంత నిరాడంబరంగా జరిగింది. సునీత పిల్లలు మరియు ఇరు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తరువాత సునీత ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. పిల్లలతో పాటు తన భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను, తన నిర్ణయాన్ని గౌరవించి అందరూ సహకారం అందించాలని ఆమె తన సందేశంలో అభిమానులకు తెలియజేశారు.

    Also Read: చివర్లో బిగ్ బాస్ కి ఝలక్ ఇచ్చిన ఆ ఇద్దరు కంటెస్టెంట్స్… కారణం?

    కాగా నిశ్చితార్థంతో పాటు సునీత పెళ్లి తేదీ కూడా ఖరారు కావడం జరిగింది. డిసెంబర్ 27వ తేదీన సునీత పెళ్లి అంటూ వార్తలు బయటికి వచ్చాయి. ఇక పెళ్లి లాంఛనమే అనుకుంటున్న తరుణంలో వాయిదాపడింది. రామ్, సునీత తమ వివాహాన్ని వాయిదా వేశారంటూ మరలా టాలీవుడ్ లో ప్రచారం జరిగింది. తాజాగా ఓ షాపింగ్ మాల్ లో దర్శనం ఇచ్చిన సునీతతో మీడియా ముచ్చటించనట్లు తెలుస్తుంది. సునీతను తన రెండో వివాహం గురించి అడుగగా ఆమె ఆసక్తికరంగా స్పందించారట.

    Also Read: ప్రేమతో చెబితే వాళ్ళు వింటారు

    మీ వివాహం… ఇక్కడే జరుగుతుందా లేక, వేరే ప్రదేశంలో జరుగుతుందా? అని రిపోర్టర్ అడుగగా… ‘కొట్టేస్తా…’ అంటూ సమాధానం చెప్పిందట. రెండో ప్రశ్నగా అసలు మీ పెళ్లి ఎప్పుడు? అని అడుగగా… నో కామెంట్ అంటూ అక్కడి నుండి నిష్క్రమించారట. దీనితో సునీత వివాహాం ఎప్పుడనేది ఆమెకే క్లారిటీ లేదా లేక దానికి ఇంకా చాలా సమయం ఉందా అనేది అర్థం కాలేదు. ఇక 19ఏళ్ల వయసులో కిరణ్ కుమార్ గోపరాజు అనే వ్యక్తిని సునీత ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల క్రితం ఆయనతో విడిపోయిన సునీత, పిల్లలతో ఒంటరిగా ఉంటున్నారు. 17ఏళ్లకే సింగర్ గా మారిన సునీత, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్