https://oktelugu.com/

‘కృష్ణ’గారిని కుటుంబ సభ్యులే తప్పుబట్టారట !

‘సూపర్ స్టార్ కృష్ణ’ అంటేనే ఆ రోజుల్లో ఒక విప్లవం. సినిమాలు తియడంలోనే కాదు, ఎన్నో నిర్ణయాలను బాహాటంగా ప్రకటించడంలోనూ కృష్ణకు తిరుగు ఉండేది కాదు. కాగా ఆయన జీవితంలో తీసుకున్న అతి పెద్ద నిర్ణయం నటి విజయ నిర్మలను పెళ్ళి చేసుకోవాలనుకోవడం, ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా.. ఎవరు ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదట. అయితే రెండో పెళ్లి చేసుకున్నాక కృష్ణగారు తన మొదటిభార్య ఇందిరా దేవితో ఎలా ఉండేవారు […]

Written By: , Updated On : March 30, 2021 / 05:42 PM IST
Follow us on

Super Star
‘సూపర్ స్టార్ కృష్ణ’ అంటేనే ఆ రోజుల్లో ఒక విప్లవం. సినిమాలు తియడంలోనే కాదు, ఎన్నో నిర్ణయాలను బాహాటంగా ప్రకటించడంలోనూ కృష్ణకు తిరుగు ఉండేది కాదు. కాగా ఆయన జీవితంలో తీసుకున్న అతి పెద్ద నిర్ణయం నటి విజయ నిర్మలను పెళ్ళి చేసుకోవాలనుకోవడం, ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా.. ఎవరు ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదట. అయితే రెండో పెళ్లి చేసుకున్నాక కృష్ణగారు తన మొదటిభార్య ఇందిరా దేవితో ఎలా ఉండేవారు ? వారి మధ్య రిలేషన్ ఎలా ఉండేది లాంటి ఆసక్తికరమైన విషయాలను ఆప్పటి ఒక సీనియర్ జర్నలిస్ట్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

కృష్ణగారికీ ‘ఇందిరా దేవి’ మరదలు అట. 1961లో వీరి వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన వివాహం అట ఇది. అయితే ‘సాక్షి’ సినిమా ద్వారా విజయ నిర్మలతో పరిచయం ఏర్పడింది కృష్ణకి. మొదట్లో వీరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇద్దరూ ఎక్కువ సినిమాల్లో వరుసగా కలిసి నటించడంతో వీరి మధ్య ప్రేమ పుట్టింది. అలా 1969లో రహస్యంగా వీళ్ళు తిరుపతిలో పెళ్ళి చేసుకున్నారు. అయితే కృష్ణ రెండో పెళ్లి చేసుకున్నా కూడా ఇందిరగారు ఎలాంటి గొడవ పడకుండా సర్దుకుపోయారట. అలాగే కృష్ణ కూడా ఇందిరగారిని ప్రేమగా చూసుకునే వారు అట.

అందుకే రెండవ పెళ్ళైన తర్వాత కూడా ఇందిరగారి ద్వారా కృష్ణగారు మళ్ళీ తండ్రి అయ్యారని.. తన భర్త పై ఉన్న ప్రేమతో ఆయన ప్రేమను ఇందిరగారు గౌరవించారని, ఆమె గొప్ప ఇల్లాలు అని ఆ సీనియర్ జర్నలిస్ట్ చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..కృష్ణగారు రెండవ పెళ్ళి చేసుకున్న సమయంలో స్వంత కుటుంబ సభ్యుల్లో కొందరు కృష్ణగారిని తప్పుబట్టే ప్రయత్నం చేస్తే.. ఇందిరగారే కృష్ణగారికి మద్దతుగా నిలిచారట.