https://oktelugu.com/

‘ప్రభాస్’ పట్టాభిషేకం స్టిల్.. రిలీజ్ డేట్ ఫిక్స్ !

‘ప్రభాస్’ నేషనల్ స్టార్ అయ్యాక శ్రీరాముడి పాత్రలో నటిస్తోన్నాడని వార్తలు రాగానే.. నిజంగా పాన్ ఇండియా రేంజ్ లో ఆ వార్త బాగా వైరల్ అయింది. పైగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ “ఏ- ఆది పురుష్” వస్తోంది. దానికి తోడు బాలీవుడ్ బడా ద‌ర్శ‌కుడు సంజ‌య్ రౌత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. పైగా దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. అందుకే ఈ సినిమా కోసం భాషతో సంబంధం […]

Written By:
  • admin
  • , Updated On : March 30, 2021 / 05:53 PM IST
    Follow us on


    ‘ప్రభాస్’ నేషనల్ స్టార్ అయ్యాక శ్రీరాముడి పాత్రలో నటిస్తోన్నాడని వార్తలు రాగానే.. నిజంగా పాన్ ఇండియా రేంజ్ లో ఆ వార్త బాగా వైరల్ అయింది. పైగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ “ఏ- ఆది పురుష్” వస్తోంది. దానికి తోడు బాలీవుడ్ బడా ద‌ర్శ‌కుడు సంజ‌య్ రౌత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. పైగా దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. అందుకే ఈ సినిమా కోసం భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీ వాళ్ళు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    కాగా తాజాగా ఈ సినిమా గురించి ఒక అదిరిపోయే అప్ డేట్ తెలుస్తోంది. శ్రీరామనవమి స్పెషల్ గా ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ని విడుదల చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. శ్రీరామనవమి అంటే వచ్చే నెల 21. మరి 21న ప్రభాస్ ఫ్యాన్స్ అలాగే శ్రీ రాముడి భక్తులకు ఆ రోజున ఒక స్పెషల్ డే అని చెప్పాలి. అన్నట్టు రాముడి పట్టాభిషేకం జరిగే సందర్భంలో స్టిల్ ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి. నిజంగానే ఈ సినిమా నుండి ఆ స్టిల్ గానీ రిలీజ్ అయితే ఇక ఇండియా వైడ్ గా సోషల్ మీడియాలో రచ్చ మొదలైనట్టే.

    ఇక ఈ సినిమాలో కృతి సనన్ సీతగా నటిస్తోంది. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. కాగా ప్రస్తుతం సైఫ్ ఉన్న ఎత్తు కంటే ఇంకాస్త ఎత్తుగా ఉన్నట్టు చూపించడం కోసం స్పెషల్ మేకప్ మరియు వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ను వాడబోతున్నారట. ఇక టి సిరీస్ సంస్థ నిర్మిస్తోన్న ఈ మూవీ మొత్తంగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తీస్తున్నారు. మొత్తానికి భారతీయ సినిమా స్థాయిని పెంచే సినిమాగా ఈ సినిమాని మలచాలని మేకర్స్ పట్టుదలగా ఉన్నారు.