రాజధానిపై కేంద్రం వైఖరి ఇదే..!

రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు తన వైఖరిని స్పష్టం చేసింది. ఇన్నాళ్లూ బీజేపీ నాయకులు తలో ప్రకటన చేసి ప్రజలను మభ్యపెట్టారు. రాజధాని తరలింపుపై హై కోర్టులు పలు పిటీషన్ లు దాఖలు అయ్యాయి. ఈ పిటీషన్ లలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తావన ఉండటంతో… హై కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విషయంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కౌంటర్ దాఖలు చేసింది. కౌంటర్ లో రాజధాని […]

Written By: Neelambaram, Updated On : August 6, 2020 7:22 pm
Follow us on


రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు తన వైఖరిని స్పష్టం చేసింది. ఇన్నాళ్లూ బీజేపీ నాయకులు తలో ప్రకటన చేసి ప్రజలను మభ్యపెట్టారు. రాజధాని తరలింపుపై హై కోర్టులు పలు పిటీషన్ లు దాఖలు అయ్యాయి. ఈ పిటీషన్ లలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తావన ఉండటంతో… హై కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విషయంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కౌంటర్ దాఖలు చేసింది. కౌంటర్ లో రాజధాని విషయంలో తన వైఖరిని స్పష్టం చేసింది. రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పేసింది.

Also Read: ముందు చంద్రబాబు స్థానం, ఆ తరువాత సీఎం పీఠం..!

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేకపోవడంతో ప్రత్యేక ప్యాకేజిలో భాగంగా 22,111.88 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, ఈ నిధుల్లో రాజధాని అభివృద్ధికి కేటాయించిన నిధులు ఉన్నాయని కౌంటర్ లో పేర్కొంది. 2015 ఏప్రిల్ 23న అప్పటి ప్రభుత్వం రాష్ట్ర రాజధానిగా అమరావతిని నోటిఫై చేసిందని, 2020 జూలై 31న ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానులకు సంబంధించి గెజిట్ ను ముద్రించిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పై రాజధాని ప్రాంత ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానికి కేంద్రం పరోక్షంగా సహకారం అందిస్తుందనే వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. రాజధాని విషయంలో మరోసారి ఇది స్పష్టమయ్యింది. శాసన మండలి రద్దు విషయం మినహా మిగిలిన అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగానే వ్యవహరిస్తూ వచ్చింది. రాజ్యసభలో ఆరుగురు సభ్యులు ఉన్న నాల్గవ అతిపెద్ద పార్టీగా వైసీపీ ఉండటంతో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగానే నడుస్తుంది.

Also Read: ఉప ఎన్నికలపై పవన్ భవితవ్యం ఆధారపడి ఉందా?

దీంతో టిడిపి నుంచి బీజేపీలోకి వెళ్లిన నేతలు చెబుతున్నవన్నీ వట్టిమాటలేననే విషయం తేలిపోయింది. బిజెపి ఎంపిగా ఉన్న సుజనా చౌదరి ఇన్నాళ్లు అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని రాజధాని రైతులను, రాష్ట్ర ప్రజలను నమ్మిస్తూ వచ్చారు. దీని వెనుక టిడిపి హస్తం ఉందని బిజెపి నాయకులు విమర్శిస్తున్నారు. రాజధాని రైతుల్లో ఆశలు రేకెత్తించి, చంద్రబాబుపై వ్యతిరేకత రాకుండా చేసేందుకే ఈ వ్యవహారాన్ని నడిపించారని వారు ఆరోపిస్తున్నారు.