ఇంగ్లండ్ తో జరుగుతున్న 4వ టీ20లో ఇండియా ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. ఇప్పటికే ఈ సిరీస్ లో 2-1తో వెనుకబడిన టీమిండియా ఈ మ్యాచ్ లో ఓడిపోతే ఇక ఈ సిరీస్ లో ఓటమి ఖాయం. అందుకే అటు ఇండియా, ఇటు ఇంగ్లండ్ తీవ్రంగా పోరాడుతున్నాయి.
నాలుగో టీ20లో టీమిండియా బ్యాటింగ్ లో రాణించింది. సిరీస్ లో తొలిసారి భారీ స్కోరు సాధించింది 8 వికెట్లు నష్టపోయి ఇంగ్లండ్ కు 186 పరుగుల భారీ లక్ష్యం నిర్ధేశించింది. వరుసగా ఇంగ్లాండ్ వికెట్లు పడడంతో 8 పరుగుల తేడాతో ఇండియా విజయం సాధించింది.
రెండో మ్యాచ్ ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ 31 బంతుల్లో 57 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. భీకరమైన షాట్లతో వణికించాడు. అరంగేట్రం ఇన్నింగ్స్ లోనే అర్ధశతకం అందుకున్నాడు. కేవలం 28 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. విధ్వంసకరంగా ఆడిన సూర్యకుమార్ రెండో వికెట్ కు రాహుల్ , పంత్ తో కలిసి 40 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
వికెట్లు పడకుండా పంత్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జోరు పెంచే క్రమంలో ఔటయ్యాడు. ఆఖర్లో శ్రేయస్ అయ్యర్ 37 మెరుపులు మెరిపించాడు. జోఫ్రా అర్చర్ 4 వికెట్లు తీశాడు.