https://oktelugu.com/

తప్పు టీడీపీ నేతలదే.. తేల్చేసిన చంద్రబాబు

చంద్రబాబు పోస్టుమార్టం నిర్వహించాడు. తన పార్టీ ఓటమికి కారణాలను అన్వేషించాడు. తప్పు టీడీపీ నేతలదేనని తేల్చారు. తెగించి పోరాడేవాళ్లకే పార్టీలో గుర్తింపు ఉంటుందని తేల్చేశాడు. ఇక నుంచి విధేయతలు, మొహమాటాలు ఇకపై చెల్లవని చంద్రబాబు తేల్చిచెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎట్టకేలకు తప్పు సొంత పార్టీ నేతలదేనని తేల్చేశాడు. తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీ నేతలు వ్యవహరించాల్సిన తీరుపై చంద్రబాబు మంగళగిరి కేంద్ర కార్యాలయంలో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో నాయకులే వైఖరియే టీడీపీ కొంప ముంచుతుందని.. క్షేత్రస్థాయిలో పనిచేయకుండా […]

Written By:
  • NARESH
  • , Updated On : March 18, 2021 / 10:14 PM IST
    Follow us on

    చంద్రబాబు పోస్టుమార్టం నిర్వహించాడు. తన పార్టీ ఓటమికి కారణాలను అన్వేషించాడు. తప్పు టీడీపీ నేతలదేనని తేల్చారు. తెగించి పోరాడేవాళ్లకే పార్టీలో గుర్తింపు ఉంటుందని తేల్చేశాడు. ఇక నుంచి విధేయతలు, మొహమాటాలు ఇకపై చెల్లవని చంద్రబాబు తేల్చిచెప్పారు.

    టీడీపీ అధినేత చంద్రబాబు ఎట్టకేలకు తప్పు సొంత పార్టీ నేతలదేనని తేల్చేశాడు. తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీ నేతలు వ్యవహరించాల్సిన తీరుపై చంద్రబాబు మంగళగిరి కేంద్ర కార్యాలయంలో సమీక్షించారు.

    క్షేత్రస్థాయిలో నాయకులే వైఖరియే టీడీపీ కొంప ముంచుతుందని.. క్షేత్రస్థాయిలో పనిచేయకుండా కబర్లు చెబితే కుదరదని చంద్రబాబు హెచ్చరించారు. ఇక వైసీపీ వైఫల్యాలపై పది ముఖ్యమైన అంశాలు గుర్తించి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని చంద్రబాబు కొత్త పిలుపునిచ్చారు.

    మున్సిపల్ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో టీడీపీ పనితీరుకు అద్దం పట్టాయని.. అందుకే నేతలదే తప్పు అని చంద్రబాబు ఓ అంచనాకు వచ్చారు.

    అందుకే తిరుపతిపై ఫోకస్ చేశారు. 2023 సార్వత్రిక ఎన్నికలలోపు ఇక మరో ఎన్నిక ఉండదని.. ఇదే పెద్ద ఎన్నికగా భావించి నేతలు పోరాడాలని చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. ఈ క్రమంలోనే తిరుపతి ఎంపీ స్థానాన్ని 75 క్లస్టర్లుగా విభబజించి ప్రతి క్లస్టర్ కు ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తిరుపతి ఉప ఎన్నికపై కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు.

    మొత్తానికి వరుస ఎన్నికల్లో టీడీపీ ఓటమికి నేతలదే తప్పు అని చంద్రబాబు తిరుపతిలో బరిలోకి దిగేశాడు. మరి ఇక్కడైనా టీడీపీ రాణిస్తుందా? లేదా అన్నది వేచిచూడాలి.