https://oktelugu.com/

రైతుల మెడకు మీటర్లు.. జగన్ కు లాభమా? నష్టమా?

దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు రైతులకు ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నాయి. దీనిపై ఎలాంటి లెక్కలు పత్రాలు లేకపోవడంతో కేంద్రం విద్యుత్ మీటర్ల బిగింపు అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇప్పటికే ఉచిత విద్యుత్‌ అమలు చేస్తున్న రాష్ట్రాలు కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైతుల కోసం విద్యుత్‌ మీటర్లు బిగించి వారిని ఇబ్బంది పెట్టలేమని తేల్చేశారు.. కానీ జగన్‌ మాత్రం దేశంలో అందరి కంటే ముందే విద్యుత్ మీటర్ల బిగింపునకు నిర్ణయం తీసుకున్నాడు. […]

Written By:
  • NARESH
  • , Updated On : October 13, 2020 3:27 pm
    Follow us on

    దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు రైతులకు ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నాయి. దీనిపై ఎలాంటి లెక్కలు పత్రాలు లేకపోవడంతో కేంద్రం విద్యుత్ మీటర్ల బిగింపు అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇప్పటికే ఉచిత విద్యుత్‌ అమలు చేస్తున్న రాష్ట్రాలు కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైతుల కోసం విద్యుత్‌ మీటర్లు బిగించి వారిని ఇబ్బంది పెట్టలేమని తేల్చేశారు.. కానీ జగన్‌ మాత్రం దేశంలో అందరి కంటే ముందే విద్యుత్ మీటర్ల బిగింపునకు నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా ఇందుకోసం నిధులు వెచ్చిస్తూ విద్యుత్ వ్యవస్థను చక్కదిద్దే పనికి పూనుకున్నారు.

    Also Read: ఉత్తరాంధ్రకు ‘అక్టోబర్‌’ భయం..!

    తాజాగా ఇంధన శాఖ, వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకంపై సోమవారం జగన్ తన క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రైతులకు మెరుగైన నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం రూ.1700 కోట్లతో పనులు చేపట్టాలని కోరారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని.. ఈ మీటర్లు అమర్చడం వల్ల రైతులకే ఎక్కువ లబ్ధి కలుగుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. మీటర్ల ద్వారా రైతులకు ఒక్క రూపాయి కూడా భారం పడబోదని అన్నారు. ఈ విషయంపై రైతుల్లో అవగాహన కల్పించాలని ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. రైతులకు పగలే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేయాలని స్పష్టం చేశారు.

    ఈ భేటి సారాంశం ఏంటంటే.. రాష్ట్రంలో రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ను నిరంతరాయంగా సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 6616 ఫీడర్ల ద్వారా 17,54,906 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఏటా రాష్ట్రంలో 12232 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం. ఏపీలో 2019 నాటికి ఈ ఫీడర్లలో 58శాతమే 9 గంటల పాటు విద్యుత్ ను అందించే స్థాయిలో ఉన్నాయి. దీంతో ఫీడర్ల వ్యవస్థ బలోపేతానికి సీఎం జగన్ ప్రభుత్వం రూ.1700 కోట్లతో పనులు మొదలుపెట్టింది. కరోనా కారణంగా పనులు ఆలస్యమయ్యాయి. ఇప్పటికీ 97.5 శాతం పనులు పూర్తయ్యాయి. రబీ నాటికి వందశాతం పూర్తయ్యాయి. ఇక మీటర్లు బిగిస్తే ఎప్పుడు? ఎక్కడ, ఎంత విద్యుత్ వాడుతున్నారనే వివరాలు తెలుస్తాయి. తద్వారా సరఫరాలో లోటుపాట్లు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది.

    Also Read: ఎల్‌ఆర్‌ఎస్‌పై తెలంగాణ సర్కార్ మరో కీలక ప్రకటన..

    ఇలా రైతులకు ఉరితాడైన విద్యుత్ మీటర్లపై అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తూ మీటర్ల బిగింపును పక్కనపెడితే సీఎం జగన్ సర్కార్ మాత్రం 1700 కోట్లతో పనులు మొదలుపెట్టడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై రైతుల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుందనేది రాబోయే రోజుల్లో తేలుతుంది. రైతులకు ఇబ్బందులు తలెత్తితే మాత్రం సీఎం జగన్ తీవ్ర ఇబ్బందుల్లో పడడం ఖాయంగా కనిపిస్తోంది.