https://oktelugu.com/

సినీ జనాలకు మరింత ‘వినోదం’.. రంగంలోకి సీనియర్లు?

‘గ్యాప్ రాలేదు.. తీసుకున్నా’ అంటూ పెద్ద హిట్ కొట్టాడు బన్నీ. అలాగే హిట్లర్ కు ముందు మెగాస్టార్ కు కూడా గ్యాప్ తప్పలేదు. ఇది మన హీరోలకే కాదు డైరెక్టర్లకు వర్తిస్తుంది. ప్రతీ ఒక్కరూ ఏదో సందర్భంలో గ్యాప్ తీసుకున్నవారే. 80వ దశకం నుంచి ఐదారేళ్ల కింది దాక తెలుగు ప్రేక్షకులను అలరింపజేసిన, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన దర్శక దిగ్గజాలు మరోసారి మెగాఫోన్ పట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కథలను రెడీ చేసుకున్నట్లు ఫిల్మ్ నగర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 13, 2020 3:27 pm
    Follow us on

    ‘గ్యాప్ రాలేదు.. తీసుకున్నా’ అంటూ పెద్ద హిట్ కొట్టాడు బన్నీ. అలాగే హిట్లర్ కు ముందు మెగాస్టార్ కు కూడా గ్యాప్ తప్పలేదు. ఇది మన హీరోలకే కాదు డైరెక్టర్లకు వర్తిస్తుంది. ప్రతీ ఒక్కరూ ఏదో సందర్భంలో గ్యాప్ తీసుకున్నవారే. 80వ దశకం నుంచి ఐదారేళ్ల కింది దాక తెలుగు ప్రేక్షకులను అలరింపజేసిన, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన దర్శక దిగ్గజాలు మరోసారి మెగాఫోన్ పట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కథలను రెడీ చేసుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. కొత్త తరాన్ని ఆకట్టుకునేందుకు సరంజామాతో సిద్ధమైనట్లు చెబుతున్నారు. మరి వీరు పాత, కొత్త తరాలను తమ సినిమాలతో మెప్పిస్తారో లేదో చూడాలి..

    Also Read: పూజాకి ‘రాధే శ్యామ్’ స్వీట్ సర్‌ ప్రైజ్ !

    * రసరమ్య చిత్రాల దర్శకేంద్రుడు..
    మాస్ మసాలా కథలతో పాటు భక్తిరస సినిమాలు తీసిన రాఘవేంద్రుడిని మరిచిపోవడం ఎవరికీ సాధ్యంకాదు. ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్లాంటి సీనియర్ హీరోలకు టాప్ ఫైవ్ సినిమాలు అందించడమే కాకుండా చిన్న హీరోలను పెట్టి ఇండస్ట్రీ హిట్లను కొట్టిన ఘనత రాఘవేంద్రరావుదే. ఆయన తీసినట్టుగా పాటలను రసరమ్యభరితంగా ఎవరూ తీసిఉండరేమో!. అందుకే పాటల చిత్రీకరణలో ఆయనను మించిన వారు లేరు. అలాంటి దర్శకేంద్రుడు మళ్లీ మెగాఫోన్ పడుతానని కొత్త కబురు అందించారు. అది కూడా శ్రీకాంత్ హీరోగా బ్లాక్బస్టర్ అందించిన పెళ్లిసందడితోనే తన రీఎంట్రీ ఉంటుందని ఇటీవల ప్రకటించారు. ఆర్.కె. ఫిల్మ్, ఆర్కా మీడియా సంయుక్త నిర్మాణంలో ఈసినిమా ఉంటుందట. త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందంటున్నారు.

    * కుటుంబ కథా చిత్రాల కృష్ణారెడ్డి..
    కృష్ణారెడ్డి సినిమాలంటే కుటుంబమంతా కలిసి కూర్చుని హాయిగా నవ్వుతూ చూసేవారు. సక్సెస్ రేట్ ఎక్కువున్న దర్శకుల్లో ఈయన తొలిస్థానంలో ఉంటారు. తీసిన చిత్రాల్లో 90శాతానికిపైగా హిట్లే.. రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు, శుభలగ్నం, యమలీల, వినోదం, ఎగిరేపావురమా, పెళ్లాం ఊరేళితే.. లాంటి సినిమాలు తెలుగు జనాన్ని అలరించాయి. అలీని హీరోగా పెట్టి తీసిన యమలీల ఇండస్ట్రీ హిట్.. శ్రీకాంత్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్లతో ఎక్కువ సినిమాలు తీశారు. ఆయన ప్రతీ చిత్రం మ్యూజికల్ హిట్టే.. ఆయనే స్వరకర్త కావడం విశేషం.. 2014 యమలీల–2తర్వాత మరోసారి వైవిధ్యభరిత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు, వచ్చే ఏడాది సెట్స్పైకి వెళ్లనున్నట్లు సమాచారం. దీని తర్వాత తన ‘వినోదం’ సినిమా సిక్వెల్ కోసం ప్లాన్ చేస్తున్నారు.

    * కమర్షియల్ సినిమాలకు కేరాఫ్.. బి.గోపాల్..
    బి.గోపాల్ సినిమాల్లో భారీతనం.. కమర్షియల్ ఎలిమెంట్ ఫుష్కలం..హీరోయిజాన్ని పీక్ లెవల్ చూపించడంలో ఈయనే అందరికీ మార్గదర్శకుడు. ఫైట్లు, పాటలు, పక్కా మాస్ స్టోరీ.. ఈయన స్పెషల్. చిరంజీవితో స్టేట్రౌడీ, ఇంద్ర ఓ ట్రెండ్ సెట్టర్స్.. బాలకృష్ణతో రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, వెంకటేశ్తో బొబ్బిలి రాజా.. ఇలా ఎన్నో సినిమాలు తెలుగు పరిశ్రమకు కాసుల పంట పండించినవే. మూడేళ్లు గ్యాప్ ఇచ్చిన బి.గోపాల్ ఇప్పుడు బాలకృష్ణ కోసం ఓ స్టోరీ రెడీ చేసినట్టు టాలీవుడ్ టాక్..

    Also Read: ఓటీటీల కొత్త రూల్స్.. బెనిఫిట్ ఎవరికీ?

    * ఫిక్షన్ చిత్రాల ‘సింగీతం’..
    ప్రయోగ చిత్రాలకు పెట్టింది పేరు సింగీతం శ్రీనివాసరావు..పుష్పక విమానం, విచిత్ర సోదరులు, ఆదిత్య 369, భైరవ ద్వీపం లాంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులు మరిచిపోలేరు. ఆదిత్య 369 సినిమాలో టైం మిషన్ కాన్సెప్ట్ నిజంగా వండర్.. శ్రీకృష్ణ దేవరాయ కాలంలో విజయనగర సామ్రాజ్య వైభవం, ప్యూచర్లో ప్రపంచం ఎలా ఉంటుందోనని ముందే ఊహించి కళ్లకు కట్టినట్టు చూపించడం ఆయనకే చెల్లింది. అలాంటి సింగీతం మళ్లీ మన డార్లింగ్ ప్రభాస్ సినిమాకు స్క్రిప్ట్ మెంటార్గా పనిచేస్తున్నారు. నాగ్ ఆశ్విన్ డైరెక్షన్లో వైజయంతీ మూవీస్ నిర్మాణంలో రాబోయే ఈ సినిమా ప్రభాస్కు 21వది. దీని తర్వాత బాలకృష్ణ హీరోగా ఆదిత్య 369 కు సిక్వెల్ తీయనున్నట్లు ఫిల్మ్నగర్ జనాలు చెబుతున్నారు. ఈ క్రేజీ సిక్వెల్ కోసం కథ రెడీ చేస్తున్నట్లు సమాచారం.