పూజాకి ‘రాధే శ్యామ్’ స్వీట్ సర్‌ ప్రైజ్ !

నేషనల్ రేంజ్ లో స్టార్ డమ్ సాధించిన ప్రభాస్ ‘రాధే శ్యామ్’ దాదాపు 7 నెలల లాంగ్ గ్యాప్ తర్వాత చిత్రయూనిట్ రీసెంట్ గా యూరప్ లో చిత్రీకరణ జరుపుతున్నారు. 15 రోజుల షెడ్యూల్ అనంతరం తిరిగి ఇండియాకి రానున్నారు. అయితే రాధేశ్యామ్ యూనిట్ హీరోయిన్ పూజా హెగ్డేకి స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ రోజు పూజా హెగ్డే బర్త్ డే సందర్భంగా తను పోషిస్తున్న క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. “ప్రేరణ” […]

Written By: admin, Updated On : October 13, 2020 1:08 pm
Follow us on

నేషనల్ రేంజ్ లో స్టార్ డమ్ సాధించిన ప్రభాస్ ‘రాధే శ్యామ్’ దాదాపు 7 నెలల లాంగ్ గ్యాప్ తర్వాత చిత్రయూనిట్ రీసెంట్ గా యూరప్ లో చిత్రీకరణ జరుపుతున్నారు. 15 రోజుల షెడ్యూల్ అనంతరం తిరిగి ఇండియాకి రానున్నారు. అయితే రాధేశ్యామ్ యూనిట్ హీరోయిన్ పూజా హెగ్డేకి స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ రోజు పూజా హెగ్డే బర్త్ డే సందర్భంగా తను పోషిస్తున్న క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. “ప్రేరణ” అన్న పాత్రలో పూజా ఈ సినిమాలో నటిస్తోందనే విషయాన్ని కూడా రివీల్ చేశారు. మొత్తానికి పూజా లుక్ అదిరిపోయింది. ఎదురుగా కూర్చున్న ప్రభాస్ నే చూస్తూ ముసిముసిగా నవ్వుతూ పూజా బాగా అకట్టుకుంది.

Also Read: అర్హ కోసం దిండుగా మారిన అయాన్!

ఇక యూరప్ నుండి వచ్చాక రామోజీ ఫిల్మ్ సిటీలో 5 కోట్ల రూపాయిలు పెట్టి వేసిన ఓ భారీ హాస్పిటల్ సెట్ లో రెండు వారాల పాటు షూట్ చేయనున్నారు. అయితే సెట్ లో చాలా తక్కువ సిబ్బంది ఉండేలా షూట్ ప్లాన్ చేస్తున్నారు. ముందుగా ప్రభాస్ పై వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లోని బిల్డప్ షాట్స్ తీయనున్నారు. ఆ తరువాత దాదాపు పది రోజుల పాటు ఇతర ఆర్టిస్ట్ ల పై కొన్ని సీన్స్ షూట్ చేయనున్నారు. ఈ సీన్స్ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంటే.. ఇక సినిమా కూడా ఆల్ మోస్ట్ పూర్తయిపోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర వెరీ ఎమోషనల్ గా ఉంటుందట.

Also Read: నాని ప్లాప్స్ కు కారణం అదేనట !

అలాగే క్లైమాక్స్ కూడా చాలా భావోద్వేగంతో సాగుతూ హెవీ ఎమోషనల్ గా ఉంటూనే.. ఫుల్ యాక్షన్ తో సాగుతోందని తెలుస్తోందట. కానీ హిట్ అండ్ ఫేమ్ కూడా లేని రాధాకృష్ణ కుమార్ అనే ‘జిల్’ మూవీ డైరెక్టర్ డైరెక్షన్ లో ఈ సినిమా రాబోతుండటంతో సినిమా మార్కెట్ పై ఆ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మరి రాధాకృష్ణ ఈ సినిమాని ఎలా తీస్తాడో.. జనం ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని నాలుగు భాషల్లో గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.