
బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.1 గా నమోదైంది. దీని ప్రభావంతో ఏపీలో పలు తీర ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి 260 కి. మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.