https://oktelugu.com/

తగ్గనంటున్న రాజమౌళి.. స్టార్ హీరోల అభిమానుల్లో టెన్షన్..?

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మొదట దర్శకుడు రాజమౌళి 2020 జులై 31న ఆర్ఆర్ఆర్ ను విడుదల చేయాలని భావించారు,. కానీ అనుకోని కారణాల వల్ల ఆ డేట్ ను 2021 జనవరి 8వ తేదీకి మార్చారు. కరోనా, లాక్ డౌన్ వల్ల మరోసారి రిలీజ్ డేట్ వాయిదా పడిన ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. రాజమౌళి జక్కన్న అనే పేరుకు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 1, 2020 / 07:06 PM IST
    Follow us on


    దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మొదట దర్శకుడు రాజమౌళి 2020 జులై 31న ఆర్ఆర్ఆర్ ను విడుదల చేయాలని భావించారు,. కానీ అనుకోని కారణాల వల్ల ఆ డేట్ ను 2021 జనవరి 8వ తేదీకి మార్చారు. కరోనా, లాక్ డౌన్ వల్ల మరోసారి రిలీజ్ డేట్ వాయిదా పడిన ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

    రాజమౌళి జక్కన్న అనే పేరుకు తగ్గట్టుగానే నెమ్మదిగా సినిమాను తెరకెక్కిస్తున్నాడని.. మరో సంవత్సరం పాటు ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కోసం ఆగాల్సిందేనని తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. 2021 దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రాజమౌళి షూటింగ్ పూర్తి చేస్తాడని భావిస్తున్నా పరిస్థితులను చూస్తుంటే సినిమా విడుదల కావడం అంతకంతకూ వాయిదా పడుతుందని తెలుస్తోంది.

    అనుకున్న విధంగా అవుట్ పుట్ వచ్చే వరకు సినిమా క్వాలిటీ విషయంలో తగ్గనని రాజమౌళి చెబుతున్నారని సమాచారం. బాహుబలి, బాహుబలి 2 సినిమాల తరువాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో అంచనాలను అందుకోవాలంటే ఆలస్యమైనా మంచి ఔట్ పుట్ తో సినిమా విడుదల చేయాలని రాజమౌళి భావిస్తున్నారు. ఏప్రిల్ వరకు ఎన్టీఆర్ తో సీన్లు తెరకెక్కించాలని తెలుస్తోంది.

    అయితే సినిమా విడుదలకు ఆలస్యమైనా ఎన్టీఆర్, రామ్ చరణ్ కెరీర్లలో ఈ సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ ఖాయమని అభిమానులు ఫిక్స్ అయ్యారు. దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతోంది.