https://oktelugu.com/

అయ్యో .. అందాల తార ఇలా అయిపోయిందేమిటి ?

హీరోయిన్‌ రక్షిత అంటేనే ముద్దుగా బొద్దుగా ఉంటుంది, పైగా తన అందంతో ఆమె అప్పట్లో ఒక ఊపు ఊపింది. రవితేజ, ఎన్టీఆర్‌ మహేశ్‌బాబు, నాగార్జున ఇలా స్టార్ హీరోల సరసన ఆడిపాడింది. తెలుగుతో పాటు కన్నడ సినిమాలలో కూడా ఆమె స్టార్ గా ఒక వెలుగు వెలిగింది. కానీ తాజాగా రక్షిత లుక్ చూసి ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. అరె.. అందాల తార ఇలా అయిపోయిందేమిటి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కెరీర్‌ లో టాప్ రేంజ్ […]

Written By: , Updated On : June 20, 2021 / 07:36 PM IST
Follow us on

Rakshithaహీరోయిన్‌ రక్షిత అంటేనే ముద్దుగా బొద్దుగా ఉంటుంది, పైగా తన అందంతో ఆమె అప్పట్లో ఒక ఊపు ఊపింది. రవితేజ, ఎన్టీఆర్‌ మహేశ్‌బాబు, నాగార్జున ఇలా స్టార్ హీరోల సరసన ఆడిపాడింది. తెలుగుతో పాటు కన్నడ సినిమాలలో కూడా ఆమె స్టార్ గా ఒక వెలుగు వెలిగింది. కానీ తాజాగా రక్షిత లుక్ చూసి ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. అరె.. అందాల తార ఇలా అయిపోయిందేమిటి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

కెరీర్‌ లో టాప్ రేంజ్ లో దూసుకుపోతున్న సమయంలోనే కన్నడ దర్శకుడు ప్రేమ్‌ను పెళ్లాడింది. పెళ్లి తరువాత రక్షిత ఇక సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది. నటనకు దూరం అయినా జోగయ్య, డీకే రెండు సినిమాలను నిర్మించి నిర్మాత అవతారం కూడా ఎత్తింది. పర్సనల్ లైఫ్ లో ఆర్థికంగా బాగా ఎదిగిన ఆమెకు హెల్త్ పరంగా మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.

ఆ ఇబ్బందులు కారణంగానే ఆమె ప్రస్తుతం ఎవరూ గుర్తు పట్టని విధంగా మారిపోయింది. నిజానికి గతంలోనే బాగా లావైపోయిన ఆమెను చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇప్పుడు ఆమె కొత్త లుక్ చూసి, అసలు ఈమె రక్షితేనా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతగా రక్షిత మారిపోయింది. మరి ఇలా అయిపోయిందేమిటి? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ నెటిజన్లు కూడా షాక్ అయినట్టు ఎమోజీలు పోస్ట్ చేస్తున్నారు.

అయితే అందాల రక్షిత ఇలా మారిపోవడానికి కారణం గురించి ఆమె ఓ సందర్భంలో చెబుతూ తనకు కొడుకు పుట్టాక థైరాయిడ్‌ సమస్య వచ్చింది అని, అది రావడంతోనే తానూ ఇలా లావెక్కానని రక్షిత చెప్పుకొచ్చింది. ఆమె వివరణ విన్నాక ఆమె అభిమానులు మెసేజ్ లు చేస్తూ.. మీరు తల్చుకుంటే ఇదివరకటిలా మారగలరు కదా అని పోస్ట్ చేస్తున్నారు. ఇంకా నాజూకుగా ఉండటానికి నేను ఇప్పుడు హీరోయిన్‌ను కాదు అంటూ తానూ ఇలాగే ఉంటాను అని స్పష్టం చేసింది రక్షిత.