https://oktelugu.com/

రైతు చట్టాలు.. ఆయుష్మాన్ భారత్.. మోడీకి కేసీఆర్ సాగిలపడ్డాడా?

అదేంటో.. ఒక్క ఢిల్లీ పర్యటన కేసీఆర్‌‌లో ఎన్నో మార్పులు తీసుకొచ్చినట్లుగా కనిపిస్తోంది. నిన్నటివరకు కేంద్ర పథకాలన్నింటినీ వ్యతిరేకించిన ఆయన.. ఇప్పుడు ఒక్కో పథకానికి మద్దతు తెలుపుతున్నారు. తాజాగా.. మరో సంచలన నిర్ణయం తీసుకుంది రాష్ట్ర సర్కార్‌‌. ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్‌ కంటే రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ పథకమే అద్భుతంగా ఉందని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు.. మోదీ తెచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకాన్నీ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 31, 2020 / 10:09 AM IST
    Follow us on


    అదేంటో.. ఒక్క ఢిల్లీ పర్యటన కేసీఆర్‌‌లో ఎన్నో మార్పులు తీసుకొచ్చినట్లుగా కనిపిస్తోంది. నిన్నటివరకు కేంద్ర పథకాలన్నింటినీ వ్యతిరేకించిన ఆయన.. ఇప్పుడు ఒక్కో పథకానికి మద్దతు తెలుపుతున్నారు. తాజాగా.. మరో సంచలన నిర్ణయం తీసుకుంది రాష్ట్ర సర్కార్‌‌. ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్‌ కంటే రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ పథకమే అద్భుతంగా ఉందని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు.. మోదీ తెచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకాన్నీ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ప్రధాని మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు.

    Also Read: నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త.. రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు..!

    పీఎం నరేంద్ర మోదీ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ సైతం హాజరయ్యారు. ‘ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భారత ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకాన్ని జోడించడానికి నిర్ణయం తీసుకున్నారని’ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలియజేశారు. ప్రధాని ప్రధానంగా ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన, జల్ జీవన్ మిషన్ పథకాల మౌలిక సదుపాయాల పురోగతిని సమీక్షించారు.

    ‘తెలంగాణ రాష్ట్రం మిషన్ భగీరథ ద్వారా అన్ని గృహాలకు పంపులతో సురక్షితమైన నీటిని అందించింది. తెలంగాణ రాష్ట్రంలో 98.5 శాతం గృహాలు సురక్షితమైన తాగునీటితో కవర్ అయ్యాయని భారత ప్రభుత్వం గుర్తించింది’ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఇన్నాళ్లు కేంద్రం తెచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్యశ్రీ వంద రెట్లు బాగుందంటూ స్టేట్‌ మెంట్లు ఇచ్చారు కేసీఆర్‌‌. ఆ పార్టీ నేతలు కూడా అదే పాట పాడారు. కానీ.. సడెన్‌గా ఆ పథకానికి మద్దతుగా నిలవడంపై ప్రాధాన్యతను సంతరించుకుంది.

    Also Read: మహిళలకు శుభవార్త.. తక్కువ వడ్డీకే ప్రత్యేక స్కీమ్స్ తో సులభంగా రుణాలు..?

    ప్రధానంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత నుంచి ఆయన ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో నియంత్రిత సాగు వేయాలని రైతులకు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన పంటలనే సాగు చేయాలని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విషయంలో వెనక్కి తగ్గింది. ఆ తర్వాత ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఎత్తేయడానికి డిసైడైనట్టు పరోక్షంగా ప్రకటించింది. కేంద్రం తెచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన భారత్ బంద్‌లో అందరి కంటే పెద్ద ఎత్తున నిరసనలు తెలిపి, జాతీయ రహదారులను దిగ్బంధించిన టీఆర్ఎస్ ప్రభుత్వం అది జరిగిన కొన్ని రోజులకే కేంద్రం చట్టాలకు జై కొట్టింది. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ విషయంలో కూడా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం విశేషం. దీని వెనుక అసలు రహస్యం మాత్రం ఏదో ఉందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్