https://oktelugu.com/

దేవుడిని ఏ రోజు ఏ పూలతో పూజించాలో మీకు తెలుసా?

  మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే మన ఇంటిని శుభ్రపరచుకుని దీపారాధన చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇంట్లో పూజను ముగించిన అనంతరం మన దగ్గర్లో ఉన్న దేవాలయాలను దర్శించి పూజలలో పాల్గొంటారు. అయితే ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించేటప్పుడు దేవుళ్లకు పువ్వులతో అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ప్రతిరోజు మనకు అందుబాటులో ఉన్న పువ్వులను తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తాము.అయితే వారంలో ఏ రోజు ఏ దేవుడికి ఎలాంటి పూలతో అలంకరించి పూజ చేయాలో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 18, 2020 12:51 pm
    Follow us on

     

    మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే మన ఇంటిని శుభ్రపరచుకుని దీపారాధన చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇంట్లో పూజను ముగించిన అనంతరం మన దగ్గర్లో ఉన్న దేవాలయాలను దర్శించి పూజలలో పాల్గొంటారు. అయితే ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించేటప్పుడు దేవుళ్లకు పువ్వులతో అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ప్రతిరోజు మనకు అందుబాటులో ఉన్న పువ్వులను తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తాము.అయితే వారంలో ఏ రోజు ఏ దేవుడికి ఎలాంటి పూలతో అలంకరించి పూజ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

    Also Read: లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే వారంలో రెండు రోజులు ఇలా చేయాల్సిందే!

    * వారంలో మొదటి రోజైన సోమవారం ఆ పరమ శివునికి ఎంతో ప్రీతికరమైనది. సోమవారం శివుడికి మారేడు దళాలు, తెల్లటి పుష్పాలతో పూజించడం వల్ల స్వామి కృపకు పాత్రులు కాగలరు.

    * ఆంజనేయ స్వామి, దుర్గామాతను మంగళవారం పూజిస్తుంటారు మంగళవారం ఆంజనేయస్వామికి ఎర్రటి పుష్పాలతో, తమలపాకులతో పూజలు నిర్వహిస్తారు.

    * బుధవారం వినాయకుడు, అయ్యప్ప స్వామి కి పూజలను నిర్వహిస్తారు. ఈరోజు ఎర్రటి గన్నేరు, గరిక, తెల్ల జిల్లేడు పూలతో స్వామివారిని పూజిస్తారు.

    * గురువారం సాయిబాబాకు పసుపుపచ్చని పువ్వులతో పూజ చేయటం వల్ల బాబా అనుగ్రహం కలుగుతుంది.

    *శుక్రవారం శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన రోజు ఈ శుక్రవారం అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఎర్రటి మందారాలతో పూజించడంవల్ల ఆ మహా లక్ష్మి మన ఇంట్లో తాండవం చేస్తుందని చెప్పవచ్చు.

    *శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి, శనీశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు అని చెప్పవచ్చు. ఈరోజు వెంకటేశ్వరస్వామిని తులసిమాలలతో, శనీశ్వరునికి నీలిరంగు పుష్పాలతో పూజ చేయటం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే నవగ్రహాలను సైతం నీలిరంగు పుష్పాలతో పూజించాలి.
    *ఆదివారం సూర్యభగవానునికి ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తారు. ఈ విధంగా వారంలో ప్రతి రోజు దేవుళ్ళకు వారికి ఇష్టమైన పువ్వులతో పూజ చేయడం వల్ల వారి అనుగ్రహం కలిగి నిత్యం సుఖసంతోషాలతో ఉండవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

    Also Read: శుభకార్యాలకు ఆటంకం కలగకూడదంటే ఈ వ్రతం చెయ్యండి!


    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం