బర్త్ డే స్పెషల్: అడవి శేష్ – పవన్ సినిమా చేయాలనుకోలేదు

వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ అభిరుచి గల హీరోగా పేరు తెచ్చుకున్నారు అడివి శేషు. సొంత నిర్మాణంలో కర్మ అనే చిత్రంతో హీరోగా మారిన అడివి శేషు… అమెరికా నుండి హైదరాబాద్ వచ్చి సినిమాను కెరీర్ గా మార్చుకున్నాడు. హిట్ చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్న అడివి శేషు పదేళ్ల టాలీవుడ్ జర్నీలో ఎన్నో ఒడిదుడుకులు, ఇబ్బందులు, ఆటుపోట్లను చూశాడు. సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగిన తరువాత పరిశ్రమలో తాను చూసిన అనుభాల జ్ఞాపకాలు కొన్ని సందర్భాలలో […]

Written By: admin, Updated On : December 17, 2020 2:56 pm
Follow us on


వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ అభిరుచి గల హీరోగా పేరు తెచ్చుకున్నారు అడివి శేషు. సొంత నిర్మాణంలో కర్మ అనే చిత్రంతో హీరోగా మారిన అడివి శేషు… అమెరికా నుండి హైదరాబాద్ వచ్చి సినిమాను కెరీర్ గా మార్చుకున్నాడు. హిట్ చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్న అడివి శేషు పదేళ్ల టాలీవుడ్ జర్నీలో ఎన్నో ఒడిదుడుకులు, ఇబ్బందులు, ఆటుపోట్లను చూశాడు. సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగిన తరువాత పరిశ్రమలో తాను చూసిన అనుభాల జ్ఞాపకాలు కొన్ని సందర్భాలలో చెప్పడం జరిగింది.నేడు అడివి శేషు పుట్టిన రోజు నేపథ్యంలో ఆయన గురించిన కొన్ని ఆసక్తికర విశేషాలు…

Also Read: ‘మేజర్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మహేష్ బాబు.. ఎలా ఉందంటే?

అడివి శేషు అసలు పేరు సన్నీ చంద్ర, తండ్రి పేరు చంద్ర అడివి… అమెరికాలో డాక్టర్. ఆయనకు కూడా సినిమా పిచ్చి ఉంది. లెజెండరీ దర్శకుడు కె విశ్వనాధ్ సినిమాలో నటించే అవకాశం రాగా.. అదే సమయంలో ప్రమాదానికి గురికావడంతో అవకాశం కోల్పోయారట. కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మల్లెపువ్వు మూవీ కోసం ఆడిషన్స్ కి వెళ్ళాను. పాత్ర రీత్యా పెద్ద వాడిగా కనిపించడం కోసం… పెన్సిల్ లెడ్ గడ్డంగా పూసుకొని వెళ్ళాను, కానీ అవకాశం రాలేదు అన్నారు అడివి శేషు. శాన్ఫ్రాన్సిస్కో యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సినిమా చేయడం జరిగింది. ఐతే చదువుకున్నంత మాత్రాన సినిమా చేయలేమని అప్పుడు అర్థమైందట అడివి శేషుకు. వెబ్ డిజైనింగ్ లో సంపాదించిన డబ్బులతో కర్మ మూవీ చేశాను. ఆ సినిమా వలన అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని అడివి శేషు చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ పంజా సినిమాలో విలన్ గా మొదట చేయకూదనుకున్నా… ఐతే పవన్ సినిమా అంటే కోట్ల మంది చూస్తారు. నీ యాక్టింగ్ నచ్చితే మంచి అవకాశాలు రావచ్చని ఒకరు సలహా ఇవ్వడంతో విలన్ గా చేశారట. ఆ సినిమా వలన తనకు మంచి గుర్తింపు వచ్చిందని అడివి శేషు అన్నారు. పంజా తరువాత విలన్, విలన్ కొడుకు పాత్రలు వచ్చినా… హీరో కావాలని గట్టి కోరిక ఉండడంతో చేయలేదట. ఇక కిస్ సినిమాకు దర్శకత్వం వహించిన అడివి శేషు ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోయారట. చివరికి ఉంటున్న ఇంటికి రెంట్ కూడా కట్టలేని స్థితికి చేరినట్లు చెప్పారు.

Also Read: వెండితెర పై సంక్రాంతి సందడి ఉంటుందా?

ఆ తరువాత క్షణం సినిమాకు రచయితగా కసిగా పనిచేశాడట అడివి శేషు. ఆ సినిమా కోసం ఏకంగా 15 వర్షన్స్ రాసుకున్నారట. నిర్మాతలకు క్షణం స్టోరీ చెప్పగా వాళ్ళు కొన్ని మార్పులు చెప్పి సినిమాను ఒకే చేశారట. ఆ సినిమా అలా కార్యరూపం దాల్చింది అన్నారు. క్షణం మూవీ మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు హిందీలో కూడా రీమేక్ అయ్యింది. ఆ తరువాత అడివి శేషు నటించిన గూఢాచారి, ఎవరు మంచి విజయాలు నమోదు చేశాయి. ప్రస్తుతం అడివి శేషు మహేష్ బాబు నిర్మాతగా…. మేజర్ మూవీలో నటిస్తున్నారు. 2008లో ఉగ్రవాదుల కాల్పులలో మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్