
అసలే అగ్రరాజ్యం.. ప్రపంచ దేశాలకు పెద్దన్న పాత్ర. మరి ఆ దేశానికి అధ్యక్షుడంటే మామూలు ముచ్చటా. అంత పెద్ద దేశానికి ప్రెసిడెంట్‌గా రెండు రోజుల క్రితమే జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఆయన జీతం ఎంత..? ఆయన ఏయే సదుపాయాలు ఉంటాయి..? ఆయన పాలనకు సంబంధించి ఎలా ఉండబోతోందో..? అందరికీ ఆసక్తికర విషయమే కదా.
Also Read: ఈ సీఎంలు పప్పులో కాలేస్తున్నారా..? : పరిణామాలు అలానే ఉన్నాయి మరి
బోయింగ్ 747–200బి జెట్ అనేది అమెరికా అధ్యక్షుడు అధికారికంగా దూర ప్రయాణాలకు ఇందులోనే వెళ్తుంటారు. ఇలాంటివి రెండు ఉంటాయి. ఇందులో మూడు అంతస్తులు.. పెద్ద సమావేశ మందిరం కూడా ఉంటుంది. గాల్లోనే ఇంధనం నింపుకోవచ్చు. 100 మంది కూర్చోవచ్చు. గంట సేపు ఇది గాల్లో ఎగిరితే.. 2 లక్షల డాలర్ల ఖర్చవుతుంది. అదీ కాక మెరీన్ వన్ అనే హెలికాప్టర్ కూడా ఉంటుంది. వీటికితోడు అత్యాధునిక బీస్ట్ అనే కారు అందుబాటులో ఉంటుంది.
ఇక ప్రెసిడెంట్ జీతభత్యాలు చూస్తే కళ్లు తిరగాల్సిందే. ఏడాదికి 4 లక్షల డాలర్లు. లక్ష డాలర్లు ప్రయాణ ఖర్చులకు, 19 వేల డాలర్లు విందులు వినోదాలకు ఇస్తారు. అమెరికా అధ్యక్షుడి నెలవారీ సగటు జీతభత్యాలు 7,114 డాలర్లు. అంటే సుమారు 5 లక్షలు. రిటైరయ్యాక పింఛన్ స్కీం సంవత్సరానికి 2 లక్షల డాలర్లు భత్యాలు ఇస్తారు.
Also Read: నందమూరి బాలక్రిష్ణ గాలితీసిన మంత్రి కొడాలి నాని
వాషింగ్టన్‌లోని పెన్సిల్వేనియా అవెన్యూ 1600గా పిలిచే ఈ శ్వేతసౌధం అధ్యక్షుడి ఇల్లే కాకుండా.. ఆఫీసు కూడా. 1800 సంవత్సరంలో నిర్మించిన ఆరంతస్తుల భవంతిలో 132 గదులు ఉంటాయి. 24 గంటలూ అందుబాటులో ఉండే వంటగది.. 42 మంది కూర్చొని చూసే హోం థియేటర్ కూడా ఉంటుంది. అధ్యక్ష కుటుంబంతోపాటు.. దాదాపు 100 మంది ఇతర సిబ్బంది ఇందులో ఉంటారు. శ్వేతసౌధం మీద అమెరికా ప్రభుత్వం ఏటా 40 లక్షల డాలర్లు ఖర్చు చేస్తుంటుంది. ఇది కాకుండా క్యాంప్ డేవిడ్, బ్లెయిర్ హౌస్ అనే రెండు అతిథి గృహాలు అందుబాటులో ఉంటాయి.
ఇక ఉపాధ్యక్ష పదవిలో ఉండే వారికి జీతభత్యాల విషయంలో కచ్చితత్వం లేదు. ప్రస్తుతానికి ఉపాధ్యక్షులకు ఏడాదికి 2.35 లక్షల డాలర్లుగా కాంగ్రెస్ నిర్ణయించింది. దీనికితోడు 10 వేల డాలర్ల భత్యాలిస్తారు. దీన్ని పెంచాలని ప్రయత్నించినా సెనెట్‌లో ఆమోదం లభించలేదు. పదవి నుంచి దిగాక ఉపాధ్యక్షులకు ఇచ్చే పింఛన్ కూడా.. సెనెట్‌లో ఎన్నేళ్లు పనిచేశారనే దానిపై ఆధారపడి ఉంటుంది. అధ్యక్షుడి భవనం శ్వేతసౌధం కాగా.. ఉపాధ్యక్షులు నెంబర్ వన్ ఆబ్జర్వేటరీ సర్కిల్ భవంతిలో ఉంటారు. 33 గదులు ఉండే ఇది శ్వేతసౌధానికి మూడు మైళ్ల దూరంలో ఉంటుంది. 1977 నుంచి ఇదే ఉపాధ్యక్షుల అధికారిక నివాసం.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్