నందమూరి బాలక్రిష్ణ గాలితీసిన మంత్రి కొడాలి నాని

ఏపీలో ఇప్పుడు ఎవ్వరి నోట్లో నోరు పెట్టినా తట్టుకోవచ్చు కానీ.. ఫైర్ బ్రాండ్ ఏపీ మంత్రి కొడాలి నాని మాత్రం టీడీపీ నేతల విమర్శలకు ధీటుగా బదులిస్తున్నాడు. జగన్ కోసం అడ్డంగా నిలబడి ప్రతిపక్షాలను బండ బూతులు తిడుతున్నాడు. జగన్ పై ఈగవాలినా నలిపేస్తున్నాడు. అయితే ఇటీవల హిందూపురం పర్యటనలో జగన్ సర్కార్ ను విమర్శించిన హీరో కం ఎమ్మెల్యే బాలక్రిష్ణ విషయంలో మాత్రం మంత్రి కొడాలి నాని కాస్త సంయమనం పాటించడం విశేషం. Also Read: […]

  • Written By: NARESH ENNAM
  • Published On:
నందమూరి బాలక్రిష్ణ గాలితీసిన మంత్రి కొడాలి నాని

ఏపీలో ఇప్పుడు ఎవ్వరి నోట్లో నోరు పెట్టినా తట్టుకోవచ్చు కానీ.. ఫైర్ బ్రాండ్ ఏపీ మంత్రి కొడాలి నాని మాత్రం టీడీపీ నేతల విమర్శలకు ధీటుగా బదులిస్తున్నాడు. జగన్ కోసం అడ్డంగా నిలబడి ప్రతిపక్షాలను బండ బూతులు తిడుతున్నాడు. జగన్ పై ఈగవాలినా నలిపేస్తున్నాడు. అయితే ఇటీవల హిందూపురం పర్యటనలో జగన్ సర్కార్ ను విమర్శించిన హీరో కం ఎమ్మెల్యే బాలక్రిష్ణ విషయంలో మాత్రం మంత్రి కొడాలి నాని కాస్త సంయమనం పాటించడం విశేషం.

Also Read: అట్టుడికిన తిరుపతి : ధర్మపరిరక్షణ యాత్రకు బ్రేక్‌

అయితే ఘాటుగా తిట్టకుండా బాలయ్య ఇజ్జత్ తీసేలా మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. బాలయ్యపై సుతిమెత్తగానే విమర్శలు గుప్పించి కడిగిపారేశారు. తాజాగా ఓ ప్రముఖ న్యూస్ చానెల్ తో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ‘బాలయ్య ఆటలో అరటిపండు అని.. ఆయన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ’ అన్నారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని బాలయ్య ఇవ్వాలా? అన్న ప్రశ్నకు ‘ఒకవేళ అడిగితే ఇచ్చేయొచ్చు’ అని నాని బదులిచ్చాడు. ప్రెసిడెంట్ పదవే తీసుకోవచ్చని.. ఆయన తండ్రి పార్టీని ఆయన అడగడంలో తప్పులేదని అన్నారు.

చిన్నపిల్లాడిలా మాట్లాడే బాలక్రిష్ణ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. బాలయ్య ఎన్టీఆర్ కుమారుడు.. రామారావు ఆకాశమంత ఎత్తులో ఉంటారని.. ఆయన కుమారుడిగా పుట్టి చంద్రబాబు తండ్రికి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుంటే ఆయన వెనుకే తిరుగుతున్నా వ్యక్తి బాలయ్య’ అంటూ సెటైర్లు వేశారు. ఒకవేళ నా తండ్రికి కనుక ఎన్టీఆర్ కు జరిగినట్లు అవమానం చేసి పార్టీ, పదవిని లాక్కుంటే నేనేంటో చూపించేవాడిని’ అంటూ మంత్రి కొడాలి నాని పరోక్షంగా బాలయ్య పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read: అట్టుడికిన తిరుపతి : ధర్మపరిరక్షణ యాత్రకు బ్రేక్‌

చంద్రబాబు తన సొంత తండ్రినే వెన్నుపోటు పొడిచి బయటకు గెంటేసినా ఇంకా బాబు వెంటే తిరుగుతుంటే బాలయ్యకు ఉన్న ఆలోచన ఏంటి? ఆయన శక్తి ఏంటో ప్రజలకు అర్థమవుతోందని మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలతో బాలక్రిష్ణ గాలి తీసేశాడు. ఇప్పుడు బాలయ్యపై కొడాలి నాని వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Read Today's Latest Most popular News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు