మహేష్ బాబు కార్ వాన్ ధర ఎంతో తెలుసా?

ఇన్నాళ్లు టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు మాత్రమే ఖరీదైన ‘కార్ వాన్’ ఉండేది. కానీ ఇప్పుడు అంతకుమించిన సౌకర్యాలతో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘కార్ వాన్’ సిద్ధమైందట.. హీరోలకు తమ సొంత కార్ వాన్ లు ఉండడం సహజమే.. బాలీవుడ్ లో మొదలైన ఈ ట్రెండ్ ను టాలీవుడ్ హీరోలు మరో ఎత్తుకు తీసుకెళుతున్నారు. ఈ విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుంటున్నారు.. తాజాగా మహేష్ బాబు సరికొత్త కార్ […]

Written By: NARESH, Updated On : March 18, 2021 5:31 pm
Follow us on

ఇన్నాళ్లు టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు మాత్రమే ఖరీదైన ‘కార్ వాన్’ ఉండేది. కానీ ఇప్పుడు అంతకుమించిన సౌకర్యాలతో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘కార్ వాన్’ సిద్ధమైందట.. హీరోలకు తమ సొంత కార్ వాన్ లు ఉండడం సహజమే..

బాలీవుడ్ లో మొదలైన ఈ ట్రెండ్ ను టాలీవుడ్ హీరోలు మరో ఎత్తుకు తీసుకెళుతున్నారు. ఈ విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుంటున్నారు..

తాజాగా మహేష్ బాబు సరికొత్త కార్ వాన్ ను తీసుకున్నట్టు టాలీవుడ్ సమాచారం. సుమారు రూ.8 కోట్ల వ్యయంతో ఈ కేర్ వాన్ తయారైందట.. చిన్న గెస్ట్ హాల్, బెడ్ రూం, బాత్ రూమ్, స్మాల్ కిచెన్, ఇంకా సకల సదుపాయాలు ఇందులో ఉన్నాయని భోగట్టా.

ఫూనేలో ఈ కార్ వాన్ ను రెడీ చేసినట్లు సమాచారం. మహేష్ కు విలాసవంతమైన ఇంటీరియర్ అంటే ఇష్టమని.. అందుకే దీనికోసం ఏకంగా 8 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు చెబుతున్నారు. మరి ఆ కార్ వాన్ ఎలా ఉంటుందో.. దాని సౌకర్యాలు ఏమిటో త్వరలోనే బయటపడుతుంది.