https://oktelugu.com/

స్టార్ హీరోయిన్ కు అరుదైన వ్యాధి

తెరపై అందంగా.. హోయలు ఒలుకుతూ కుర్రకారు మతిపోగొట్టే భామ కాజల్ ను చూస్తే ఎవ్వరైనా చూపు తిప్పుకోనివ్వరు. అలాంటి అందం, చందం ఆమె సొంతం. ఇటీవల పెళ్లి చేసుకొని మల్దీవుల్లో హానీమూన్ చేసుకొని ఆ ఫొటోలతో కాకరేపిన కాజల్ కు ఓ అరుదైన వ్యాధి ఉందన్న సంగతి తాజాగా బయటపడింది. తాజాగా ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో అభిమానులతో షాకింగ్ విషయాన్ని పంచుకున్నారు. తాను చిన్నప్పటి నుంచి ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు ఆమె బాంబు […]

Written By:
  • NARESH
  • , Updated On : February 9, 2021 / 09:21 PM IST
    Follow us on

    తెరపై అందంగా.. హోయలు ఒలుకుతూ కుర్రకారు మతిపోగొట్టే భామ కాజల్ ను చూస్తే ఎవ్వరైనా చూపు తిప్పుకోనివ్వరు. అలాంటి అందం, చందం ఆమె సొంతం. ఇటీవల పెళ్లి చేసుకొని మల్దీవుల్లో హానీమూన్ చేసుకొని ఆ ఫొటోలతో కాకరేపిన కాజల్ కు ఓ అరుదైన వ్యాధి ఉందన్న సంగతి తాజాగా బయటపడింది.

    తాజాగా ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో అభిమానులతో షాకింగ్ విషయాన్ని పంచుకున్నారు. తాను చిన్నప్పటి నుంచి ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు ఆమె బాంబు పేల్చారు.

    తనకు చిన్న వయసులోనే బ్రాంకియాల్ ఆస్తమా(శ్వాసకోశ వ్యాధి) అటాక్ అయినట్లు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించింది. ఈ వ్యాధి కారణంగా తాను తిండి కూడా సరిగా తేలలేదని ఆమె చెప్పుకొచ్చారు. శీతాకాలం వస్తే ఈ వ్యాధి లక్షణాలు మరింత ఎక్కువగా అయ్యేవన్నారు. ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడినట్లు ఆమె తన ఇబ్బందులను అభిమానులతో పంచుకుంది.

    కాజల్ అగర్వాల్ అంత పెద్ద వ్యాధితో బాధపడుతూ అన్ని సినిమాలు చేసి.. అంత కష్టపడ్డ తీరు చూశాక అభిమానులంతా షాక్ అవుతున్నారు. తన వెంట ఎప్పుడూ ఇన్ హేలర్ ఉంటుందని.. పరిగెత్తే సీన్లు చేసిన ఇన్ హేలర్ తో సేదతీరుతానని ఆమె తన కస్టాలు చెప్పుకొచ్చారు.