ఇండియాలో సెకండ్ వేవ్ మొదలైందా..? కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?

సంవత్సరం పాటు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే నెమ్మదించింది.. రెండు మూడు నెలలుగా పాజిటివ్ కేసులు తగ్గుతూ వచ్చాయి. దీంతో ఈ మహమ్మారి పీడ వదిలిందని జనం ఊపిరి పీల్చుకున్నారు. ఎవరి పనులు వారు చేసుకుంటూ సాధారణ జీవనం గడుపుతున్నారు. అయితే నాలుగు నెలల ముందే ఇండియా లాంటి దేశాల్లో లాక్ డౌన్ ఎత్తేసీ ఆయా కార్యకలాపాలను నిర్వహించుకున్నారు. సెప్టెంబర్ నెలలో 90 వేల కేసులు నమోదవుతున్నా జనం రోడ్లపైకి వచ్చారు. ప్రజలు చావో, […]

Written By: NARESH, Updated On : February 28, 2021 10:06 am
Follow us on

సంవత్సరం పాటు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే నెమ్మదించింది.. రెండు మూడు నెలలుగా పాజిటివ్ కేసులు తగ్గుతూ వచ్చాయి. దీంతో ఈ మహమ్మారి పీడ వదిలిందని జనం ఊపిరి పీల్చుకున్నారు. ఎవరి పనులు వారు చేసుకుంటూ సాధారణ జీవనం గడుపుతున్నారు. అయితే నాలుగు నెలల ముందే ఇండియా లాంటి దేశాల్లో లాక్ డౌన్ ఎత్తేసీ ఆయా కార్యకలాపాలను నిర్వహించుకున్నారు. సెప్టెంబర్ నెలలో 90 వేల కేసులు నమోదవుతున్నా జనం రోడ్లపైకి వచ్చారు. ప్రజలు చావో, రేవో అంటు తమ విధుల్లో మునిగారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. వ్యాక్సిన్ ప్రభావమో.. కరోనా వైరస్ లో మార్పుతోనే జనవరిలో కేసులు భారీగా తగ్గాయి.. కానీ అంతలోపే మళ్లీ కేసులు పెరుగుతున్నాయి.. ఎందుకుంటే..

మహారాష్ట్రలోని ముంబైకి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతిలో ఒకేరోజు 19 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రెండు మూడు రోజుల వ్యవధిలో 10 వేలకు పైగా బాధితులు పెరిగారు. అలాగే 66 మంది ఈ వైరస్ తోమరణించారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై లాక్డౌన్ ప్రకటించాల్సి వచ్చింది. 25 లక్షల జనాభా ఉన్న అమరావతిలో దాదాపు కోవిడ్ హాట్ స్పాట్లు గా మారిపోయాయి. అకస్మాత్తుగా కోవిడ్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ వ్యాధిబారిన పడిన వారి సంఖ్య మాత్రం పెరుగుతుందని వైద్యలు పేర్కొంటున్నారు. మహారాష్ట్రలో మొన్నటి గురువారం 9,000 కేసులు నమోదయ్యాయి. ఇదే రోజు 80 మంది వ్యాధి బారినపడి మరణించారు.

అయితే కేసులు పెరగడానికి కారణం ఒక్కటే అని నిర్దారించలేం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఇండియాలో ఎక్కడ చూసినా జనం గుంపులు, గుంపులుగానే ఉంటారు. భౌతిక దూరం పాటింటే ఆస్కారం ఉండదు. మరోవైపు కరోనా కేసులు తగ్గడంతో వైద్యశాఖ సైతం టెస్టుల సంఖ్య తగ్గించింది అని మహారాష్ట్ర వైద్యుడొకరు చెప్పారు. దీంతో మహారాష్ట్రతో పాటు కేరళ, కర్ణాటక, చత్తీస్ గడ్ లాంటి రాష్ట్రాల్లోనూ కేసులు పెరగడం చూస్తున్నాం అని ఆయన చెప్పారు.

కరోనా సోకిన తరువాత మళ్లీ వ్యాధి బారిన పడడంపై రకరకాల వాదలను ఉన్నాయి. రెండోసారి వ్యాధి వచ్చే అవకాశం లేదని కొందరు చెబుతుంటే.. జాగ్రత్తలు పాటించకపోతే ఎన్ని సార్లయినా వచ్చే అవకాశం ఉందని ఇంకొందరు అంటున్నారు. అయితే రెండో సారి కేసులు పెరుగుతాయనేది ఊహించిందేనని, ఇది ఇతర దేశాల్లో కూడా జరిగిందని నిపుణులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా కరోనా వైరస్ లో వస్తున్న మార్పుకు కూడా కేసులు పెరగడం కావచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. వైరల్ లు తరుచుగా జెనెటిక్ కోడ్ మారే విధంగా పరివర్తన చెందుతూ ఉంటాయి. కొన్ని రకాల మ్యుటేషన్లు వైరస్ వేగంగా వ్యాప్తి చెందేందుకు కారణమవుతాయని వైద్యులు అంటున్నారు. కొన్నిసార్లు యాంటీబాడీలు ప్రభావవంతంగా పనిచేయకుండా అడ్డుకుంటాయని అంటున్నారు. ఈ పరిస్థితి బ్రిటన్, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ లాంటి దేశాల్లో కనిపించిందని అంటున్నారు. మొత్తంగా భారత్ లోనూ కరోనా రూపాంతరం చెంది సెకండ్ వేవ్ మొదలైందనే చెప్పొచ్చు.

Tags