మహేష్ తో అనిల్ రావిపూడి వన్స్ మోర్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్లతో దూసుకెళుతున్నాడు. శ్రీమంతుడు.. భరత్ అనే నేను.. మహర్షి సినిమాలతో హట్రిక్ విజయాలను అందుకున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో వచ్చి మరోసారి ఇండస్ట్రీ హిట్టందుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయం సాధించడంతో మరోసారి వీరి కాంబో వస్తుందనే టాక్ విన్పించింది. Also Read: రానాతో సామ్ ‘జామ్’ ఎలా ఉండబోతుందో ? మహేష్ బాబు తాజాగా పర్శురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న […]

Written By: NARESH, Updated On : November 23, 2020 11:25 am
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్లతో దూసుకెళుతున్నాడు. శ్రీమంతుడు.. భరత్ అనే నేను.. మహర్షి సినిమాలతో హట్రిక్ విజయాలను అందుకున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో వచ్చి మరోసారి ఇండస్ట్రీ హిట్టందుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయం సాధించడంతో మరోసారి వీరి కాంబో వస్తుందనే టాక్ విన్పించింది.

Also Read: రానాతో సామ్ ‘జామ్’ ఎలా ఉండబోతుందో ?

మహేష్ బాబు తాజాగా పర్శురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారువారిపాట’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాలో మహేష్ కు జోడీ కీర్తి సురేష్ నటిస్తుండటంతో సినిమాపై మహేష్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక మహేష్ బాబు తనకు హిట్స్ ఇచ్చిన దర్శకులను రిపీట్ చేయడంలో ముందుంటాడు.

Also Read: బిగ్ బాస్ : ప్రోమోనే ఇలా ఉంటే.. ఇక ఎపిసోడ్ ఎలా ఉంటుందో !

దర్శకులు సినిమా తీసేవిధానం నచ్చితే మహేష్ బాబు వారితో మళ్లీ మళ్లీ కలిసే పనిచేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతుంటాడు. మహేష్ బాబు ఇప్పటికే పలువురి దర్శకులను రిపీట్ చేసి ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నాడు. ఇటీవల మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనిల్ రావిపూడి మరోసారి కలిసే పని చేసేందుకు సిద్ధమనేని ప్రకటించాడు. మంచి కథతో తన వద్దకు వస్తే గ్రీన్ సిగ్నల్ ఇస్తానంటూ చెప్పాడు.

నేడు దర్శకుడు అనిల్ రావిపూడి పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై స్పందించారు. తాను మహేష్ బాబుతో మరో సినిమా చేసేందుకు ఇప్పటికే ఓ కథను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆయన నుంచి ఎప్పుడు పిలుపిస్తే అప్పుడు వెళ్లి కథను విన్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. దీంతో మరోసారి వీరిద్దరి కాంబినేషన్ సెట్ అవుతుందనే టాక్ విన్పిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారివారిపాట’ మూవీలో నటిస్తున్నాడు. దీని ద్వారా రాజమౌళితో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి సినిమా కనీసం రెండు.. మూడేళ్లు సమయం పడుతుంది. మరోవైపు అనిల్ రావిపూడి ‘ఎఫ్-3’ సిక్వెల్ తీసేందుకు రెడీ అవుతున్నాడు. దీంతో వీరి కాంబో సెట్టవడానికి చాలా సమయం పట్టేలా కన్పిస్తోంది. అనిల్ కు మహేష్ బాబు ఎప్పుడు టైం కేటాయిస్తారో వేచిచూడాల్సిందే..!