https://oktelugu.com/

భాగ్యనగర వాసులకు శుభవార్త… 57 ఉచిత వైద్య పరీక్షలు..?

సాధారణంగా వైద్యుల సూచనల మేరకు రక్త, మూత్ర పరీక్షలు ఎక్స్ రే, ఇతర పరీక్షలు చేయించుకోవాలంటే డయాగ్నోస్టిక్ కేంద్రాలకు వేల రూపాయలు చెల్లించాల్సిందే. చిన్నచిన్న వ్యాధులను గుర్తించడానికి కూడా పలు సందర్భాల్లో ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే తెలంగాణ సర్కార్ హైదరాబాద్ వాసులకు శుభవార్త చెప్పింది. ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకునే అవకాశం కల్పిస్తోంది. Also Read: కేసీఆర్ కలల ‘ధరణి’కి హైకోర్టు చెక్ హైదరాబాద్ నగరంలో ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవడానికి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 23, 2021 11:29 am
    Follow us on

    Mini Hubs For Diagnosis

    సాధారణంగా వైద్యుల సూచనల మేరకు రక్త, మూత్ర పరీక్షలు ఎక్స్ రే, ఇతర పరీక్షలు చేయించుకోవాలంటే డయాగ్నోస్టిక్ కేంద్రాలకు వేల రూపాయలు చెల్లించాల్సిందే. చిన్నచిన్న వ్యాధులను గుర్తించడానికి కూడా పలు సందర్భాల్లో ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే తెలంగాణ సర్కార్ హైదరాబాద్ వాసులకు శుభవార్త చెప్పింది. ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకునే అవకాశం కల్పిస్తోంది.

    Also Read: కేసీఆర్ కలల ‘ధరణి’కి హైకోర్టు చెక్

    హైదరాబాద్ నగరంలో ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ప్రభుత్వం ఏకంగా 8 డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ వాసులకు ఇకపై ఈసీజీ, ఆల్ట్రాసౌండ్‌, రేడియాలజీ పరీక్షలతో పాటు ఎక్స్ రే, రక్త, మూత్ర పరీక్షలు ఉచితంగా అందనున్నాయి. తెలంగాణ సర్కార్ ఉచితంగా పరీక్షలు చేయించుకోవడానికి పురానాపూల్‌, సీతాఫల్‌మండి, జంగంపేట, పానీపురా, అంబర్‌పేట్‌, బార్కాస్‌, లాలాపేట, శ్రీరాంనగర్‌ లలో డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

    Also Read: హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరిన్ని సిటీ బస్సులు…?

    నేటి నుంచి ఈ డయాగ్నోస్టిక్ కేంద్రాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేయడం గురించి మాట్లాడుతూ బస్తీ దవాఖానాల్లో వైద్యం చేయించుకునే పేదల కొరకు ఈ డయాగ్నోస్టిక్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. వేల రూపాయలు ఖర్చు చేసి వైద్యం చేయించుకోలేని వారి కోసం ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    35 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గాంధీ ఆస్పత్రిలో అత్యాధునిక కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ దవాఖానాలను అభివృద్ధి చేయడమేనని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ డయాగ్నోస్టిక్ కేంద్రాల ఏర్పాటు ద్వారా ఆల్ర్టా సౌండ్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ లాంటి పరీక్షలు చేయించుకోవచ్చని ప‌ట్ట‌ణ పేద‌ల‌కు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అన్నారు.