https://oktelugu.com/

ఇద్దరు సీఎంల ఢిల్లీ పర్యటన.. తెరవెనుక రాజకీయం ఇదేనా?

కేంద్రంలో బీజేపీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. 2018ఎన్నికల ముందు ప్రధాని మోడీ కాంగ్రెస్ ముక్త భారత్ పేరుతో అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను తుదముట్టించి అధికారంలోకి రావాలని ప్లాన్ వేశారు. దీనిలో భాగంగానే ఉత్తరాదిని బీజేపీ పట్టు సాధించింది. ఇక బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడంతో దక్షిణాదిలోనూ కాంగ్రెస్ లేకుండా చేయాలని వ్యూహాలు రచిస్తోంది. Also Read: కరోనా కల్లోలంలోనూ మన కుబేరుల సత్తా ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ మంచి పట్టుంది. ఈ రాష్ట్రాల్లో ఎక్కువ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 15, 2020 / 02:27 PM IST
    Follow us on

    కేంద్రంలో బీజేపీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. 2018ఎన్నికల ముందు ప్రధాని మోడీ కాంగ్రెస్ ముక్త భారత్ పేరుతో అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను తుదముట్టించి అధికారంలోకి రావాలని ప్లాన్ వేశారు. దీనిలో భాగంగానే ఉత్తరాదిని బీజేపీ పట్టు సాధించింది. ఇక బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడంతో దక్షిణాదిలోనూ కాంగ్రెస్ లేకుండా చేయాలని వ్యూహాలు రచిస్తోంది.

    Also Read: కరోనా కల్లోలంలోనూ మన కుబేరుల సత్తా

    ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ మంచి పట్టుంది. ఈ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు సాధించడం ద్వారా ఇప్పటి వరకు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తున్న సంగతి తెల్సిందే. బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక మినహా ఎక్కడా పెద్దగా పట్టులేదు. తెలుగు రాష్ట్రాల విభజనతో బీజేపీకి ఈ రెండు రాష్ట్రాల్లోనూ బలపడే అవకాశం దక్కింది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో ఈ రెండు రాష్ట్రాల్లో పట్టుకోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.

    ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ బలపడింది. ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. ఇక ఏపీలోనూ సీఎం జగన్ దూకుడుకు టీడీపీ కనుమరుగయ్యేలా ఉండటంతో ఆ స్థానంలోకి బీజేపీ రావాలని ప్లాన్ చేస్తోంది. తెలంగాణలో టీపీసీసీ మార్పు నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ను బీజేపీ ఢిల్లీకి పిలిపించుకొని తాజా రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

    తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ బలపడకుండా టీఆర్ఎస్ సహకారం తీసుకోనుందనే టాక్ విన్పిస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్.. బీజేపీ మినహా మరే పార్టీ బలపడొద్దని ఈ రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా సీఎం కేసీఆర్ కేంద్ర అమిత్ షాతో చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది.

    Also Read: రజినీకాంత్ సంచలనం: పార్టీ పేరు, గుర్తు ఖరారు.. ఇవే?

    ఇక ఏపీలోనూ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు.. తిరుపతి ఉప ఎన్నిక జరుగుబోతుంది. ఈక్రమంలోనే టీడీపీకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా బీజేపీ పావులు కదుపుతోంది. ఏపీలో టీడీపీ కనుమరుగైతే ఆ స్థానంలో బీజేపీకి దక్కతుందని ఆశ పడుతోంది. దీంతో సీఎం జగన్ తో ఆమేరకు చర్చించినట్లు తెలుస్తోంది.

    ఏదిఏమైనా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలపడకుండా ఇద్దరు సీఎంలను బీజేపీ పెద్దలు ఢిల్లీకి పిలిపించుకొని పావులు కదుపుతున్ననట్లు తెలుస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతే కేంద్రంలో తమకు ఢోకా లేకుండా పోతుందని బీజేపీ భావిస్తోంది. దీనిలో భాగంగానే ఇద్దరు సీఎంలతో బీజేపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్