Also Read: యూకే నుంచి తెలంగాణకు వచ్చిన వారి లెక్క తేలిందా?
సుమారు నెలరోజులుగా పంజాబ్.. హర్యానా.. యూపీ రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేపడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు కేంద్రం రైతులతో చర్చించినా ఎటువంటి ఫలితం రాలేదు. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడుతోంది.
ఇప్పటికే రైతులు భారత్ బంద్.. రోడ్ల దిగ్భంధం.. ధర్నాలు వంటివి పెద్దఎత్తున చేపట్టారు. ఇక తాజాగా ఢిల్లీ రైతులు సింఘు సరిహద్దు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ పర్యటనకు రావొద్దని పెద్దఎత్తున నినదాలు చేశారు.
Also Read: బ్రేకింగ్: ఏపీ నూతన సీఎస్ గా ఈయనే.. భారీ ప్రక్షాళన
జనవరి 26న భారత్ లో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరు కానున్నారు. అయితే రైతుల డిమాండ్లను ఒప్పుకునేంత వరకు ఆయన భారత్ కు రావద్దని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
బ్రిటన్ ఎంపీలు కూడా ఆ దేశ ప్రధానిపై ఒత్తిడి తీసుకు రావాలని ఢిల్లీ రైతులు కోరుతున్నారు. దీంతో బ్రిటన్ ప్రధాని రైతుల సెగ తాకేలా కన్పిస్తోంది. కాగా చర్చలపై కేంద్రం రాసిన లేఖపై రేపు నిర్ణయం తీసుకోనున్నట్లు రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్